సింపుల్ లుక్.. కుర్రకారు గుండెల్లో గుబులు!
అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నభా నటేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నభా నటేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకసారి పట్టు చీరలో సాంప్రదాయంగా కనిపిస్తూ.. లంగా ఓణీలో తెలుగింటి ఆడపడుచులా అందరి హృదయాలను దోచుకునే ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు మోడ్రన్ డ్రెస్ లతో యువతను ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న నభా నటేష్ తాజాగా మరో అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
సింపుల్ లుక్.. స్టన్నింగ్ ఫోజ్..
తాజాగా షార్ట్ మినీ డ్రెస్ ధరించిన ఈమె..ఇందులో సింపుల్ గా కనిపిస్తూనే తన స్టన్నింగ్ ఫోజ్ లతో కుర్రకారును తన వశం చేసుకుంది. ముఖ్యంగా పింక్ అండ్ వైట్ సింపుల్ డ్రెస్ ధరించి,ఎటువంటి జ్యువెలరీ ధరించకుండా సింపుల్గా క్యాజువల్ గా కనిపించి అందరి హృదయాలను దోచుకుంది. పైగా వర్షం పడిన వేళ మెట్లపై స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. మనసులో పల్లెటూరి అమ్మాయి భావాలు కలుగుతున్నాయి అంటూ పంచుకున్న క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే లేటెస్ట్ లుక్కుతో సరికొత్త ఫోజులతో మెప్పించే ప్రయత్నం చేసింది నభా నటేష్.
మోడల్ నుండి పాన్ ఇండియా స్టార్..
1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లాలో శృంగేరిలో జన్మించింది. మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన నభా నటేష్ కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వజ్రకాయ ద్వారా తన అరంగేట్రాన్ని చేసింది. 2015లో కన్నడ సూపర్ స్టార్ శివరాజు కుమార్ తో కలిసి ఈ సినిమా ద్వారా ఆమె అరంగేట్రం జరిగింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఇండస్ట్రీలోకి రాకముందు 2013లో సెమినా మిస్ ఇండియా బెంగళూరులో టాప్ టెన్ లో ఒకరిగా కనిపించింది.
తొలి తెలుగు చిత్రం..
2018లో తొలిసారి నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు, నభానటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పరవాలేదు అనిపించింది. పైగా అటు సుధీర్ బాబుకి కూడా ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె మళ్లీ కొంతకాలం గ్యాప్ తీసుకొని నాగబంధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
నభా నటేష్ ప్రస్తుత చిత్రాలు..
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు అనే యాక్షన్ అడ్వెంచర్ పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకోవాలని పరితపిస్తోంది నభానటేష్. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య ఈనెల ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఈమెకు ఎలాంటి స్టేటస్ ను అందిస్తుందో చూడాలి.