లెహంగా సోయగాలతో మైమరపిస్తున్న నభా నటేష్!
అందులో భాగంగానే తాజాగా మరోసారి లెహంగా అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అయిపోయింది
ఇటు తమ అందాలను ఆరబోయడమే కాకుండా అటు తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేపడుతూ సోషల్ మీడియాలో మరింత బిజీ అయిపోయారు సెలబ్రిటీలు. ఒకరి తర్వాత ఒకరు తమ అందాలను ఆరబోయడమే కాకుండా.. ఒకరిని మించి మరొకరు గ్లామర్ డోస్ పెంచి మరీ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో నభా నటేష్ కూడా ఒకరు. అందం, అభినయంతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది. రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో దర్శనమిస్తూ గ్లామర్ వలకబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
అందులో భాగంగానే తాజాగా మరోసారి లెహంగా అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సియా ఫ్యాషన్ బొటిక్ డిజైన్ చేసిన ఆరెంజ్ కలర్ లెహంగా ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మనోజ్ఞ గొల్లపూడి స్టైలింగ్ తో తన లుక్ ను మరింత పర్ఫెక్ట్ గా మార్చుకుంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సందీప్ క్లిక్ మనిపించిన ఈ ఫోటోలలో మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. హెవీ బ్యాంగిల్స్ ధరించిన ఈమె.. చెవి దిద్దులతోపాటు దానికి కాంబినేషన్లో సింపుల్ నెక్ చౌకర్ ను ధరించి ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే కాటుక కళ్ళతో ఆకట్టుకున్న ఈమె లెహంగా సోయగాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా "పురాణం.. అద్భుతాలతో నిండిన కథ" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఇక ప్రస్తుతం నభా షేర్ చేసిన ఈ లెహంగా గ్లామర్ పిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
చిక్ మంగళూరు జిల్లాకి చెందిన నభా నటేష్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో శివరాజ్ కుమార్ తో కలిసి వజ్రకాయ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. తెలుగులో మాత్రం నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇకపోతే ఈమెకు మంచి గుర్తింపును అందించిన చిత్రం మాత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాలో ఈమెతో పాటు నిధి అగర్వాల్ కూడా మరో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
చివరిగా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె తాజాగా నిఖిల్ తో స్వయంభు, విరాట్ కర్ణతో నాగబంధం, అలాగే టైసన్ నాయుడు అనే చిత్రాలలో నటిస్తోంది. ముఖ్యంగా స్వయంభు సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుండగా.. అటు అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న నాగబంధం సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టైసన్ నాయుడు సినిమాలో కూడా నటిస్తోంది. ఏదేమైనా వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.