నెమలిలా మెరిసిపోతున్న 'ఇస్మార్ట్ బ్యూటీ'.. నభా నటేష్ ఫోటోలు వైరల్!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నభా నటేష్, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.;
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నభా నటేష్, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. "కలలోంచి ఒక నెమలిలా నిద్రలేచాను" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. గ్రీన్ కలర్ శారీలో నభా ఇస్మార్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టేలా కనిపిస్తోంది ఈ కన్నడ కస్తూరి. ఆ విశేషాలు చూద్దాం..
ఆలివ్ గ్రీన్ శారీలో మెరిసిన అందం:
నభా నటేష్ ఈ ఫోటోషూట్ కోసం ప్రముఖ బ్రాండ్ 'సుత' కి చెందిన ఆలివ్ గ్రీన్ మల్ముల్ కాటన్ శారీని ఎంచుకుంది. ఈ చీరపై ఉన్న మెరిసే సీక్విన్స్, పల్లుకు ఉన్న ట్రెడిషనల్ టాసెల్స్ ఆమెకు ఒక క్లాసిక్ లుక్‌ని ఇచ్చాయి. ప్రముఖ స్టైలిస్ట్ మనోజ్ఞ గొల్లపూడి డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌లో నభా నిజంగానే ఒకగ్రీన్ నెమలిలా మెరిసిపోతోంది. సింపుల్ మేకప్, ఆకర్షణీయమైన కళ్లతో నభా ఇస్తున్న పోజులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ:
కెరీర్ మొదట్లో వజ్రకాయ, నన్ను దోచుకుందువటే సినిమాలతో మెప్పించిన నభా, 'ఇస్మార్ట్ శంకర్'తో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇక 'డార్లింగ్' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఈ బ్యూటీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన నభా, బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
రాబోయే చిత్రాలు:
నభా నటేష్ రాబోయే చిత్రాలు చూస్తుంటే ఆమె రూట్ మార్చినట్లు అనిపిస్తోంది. 'స్వయంభు' సినిమాలో ఆమె 'సుందరవల్లి' అనే హుందాతనమైన యువరాణి పాత్రలో కనిపించబోతోంది. దీనికోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట. అలాగే 'నాగబంధం' అనే సినిమాలో 'పార్వతి' అనే చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తి భిన్నమైన కథలతో రాబోతుండటంతో ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇస్మార్ట్ బ్యూటీ గ్రాండ్ కమ్‌బ్యాక్:
ఒకవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో రచ్చ చేస్తూనే, మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నభా దూసుకుపోతోంది. ముఖ్యంగా నిఖిల్ తో స్వయంభు, విరాట్ కర్ణ హీరోగా నాగబంధం చిత్రాలు రానున్నాయి. ఇవి ఆమె కెరీర్‌కు ఎంతో కీలకం కానున్నాయి. తన పాత ఇమేజ్‌ను మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్న నభాకు ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి. ఏది ఏమైనా ఈ 'ఇస్మార్ట్ బ్యూటీ' మరోసారి టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి వెళ్లడం పక్కా అనిపిస్తోంది.