నభా ఆశలపై నీళ్లు జల్లినట్లేనా?

యాక్సిడెంట్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధం అనగానే పలు ఆఫర్స్ తలుపు తట్టాయి.

Update: 2026-07-04 19:30 GMT

విరాట్‌ కర్ణ ముఖ్య పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ బాగుందని కొందరు, స్టోరీ లైన్‌ బాగుందని మరికొందరు అంటున్నారు. మిక్స్డ్‌ టాక్‌ అన్నట్లుగా రివ్యూలు వచ్చాయి. రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ శని, ఆదివారాల్లో సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమా ఫలితం విషయం పక్కన పెడితే హీరోగా నటించిన విరాట్‌ కర్ణ బాగా కష్టపడ్డాడు అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు. అంతే కాకుండా భవిష్యత్తులో మంచి నటుడిగా విరాట్‌ నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మరో వైపు నభా నటేష్ విషయంలో మాత్రం చాలా మంది పెదవి విరుస్తున్నారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత నభా నటేష్‌...

నభా నటేష్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన నభా నటేష్ కి దురదృష్టం వెంటాడి చిన్న యాక్సిడెంట్‌ జరిగి సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. యాక్సిడెంట్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధం అనగానే పలు ఆఫర్స్ తలుపు తట్టాయి. ముఖ్యంగా నాగబంధం, స్వయంభూ, టైసన్ నాయుడు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. కాని మూడు సినిమాలకు మూడు కూడా చాలా స్లోగా సాగుతూ ఉన్నాయి. నాగబంధం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూపులు చూసేలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు నాగబంధం విడుదల అయ్యింది. పార్వతి అనే పాత్రలో నభాను నాగబంధం సినిమాలో చూడవచ్చు. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవడంతో ఆమెకు నటించేందుకు గొప్ప స్కోప్‌ అయితే దక్కలేదు.

నాగబంధం సినిమాలో పార్వతి పాత్రలో...

వేదాలు చదువుకునే అమ్మాయి పాత్రలో నభాను చూపించడం జరిగింది. అయితే నమో రే పాటలో నభా లుక్స్‌ పరంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ప్రత్యేకంగా భరతనాట్యం స్టెప్స్‌ వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. నభాలో ఈ ప్రతిభ కూడా ఉందా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా డాన్స్ చేసింది. నాగబంధం సినిమా విడుదలైన వెంటనే నభా నటేష్ కు రెండు మూడు ఆఫర్లు అయినా వస్తాయని కొందరు భావించారు. ఆమె సైతం నాగబంధం సినిమాతో బిజీ కాబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. కానీ సినిమా విడుదలైన తర్వాత అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. నభా నటేష్ ఆశలపై నీళ్లు జల్లినట్లుగానే నాగబంధం ఫలితం ఉందని, ఆమె పాత్ర విషయంలోనూ అలాగే జరిగిందని సోషల్‌ మీడియాలో కొందరు అప్పుడే నభా నటేష్ గురించి మాట్లాడుకుంటున్నారు.

నభా నటేష్ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు...

మాస్ట్రో సినిమాలో నటించిన సమయంలో నభా నటేష్ చేతిలో పలు సినిమాలు ఉండేవి. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో మల్టీపుల్‌ ఫ్యాక్చర్స్‌ అయ్యాయి. దాంతో నభా నటేష్‌ కొన్ని నెలల పాటు పూర్తిగా బెడ్‌ కి పరిమితం అయ్యింది. సాధారణంగా హీరోయిన్స్‌కి గ్యాప్‌ వస్తే తిరిగి సినిమాల్లో ఆఫర్లు రావడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. కానీ నభా నటేష్‌కి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అదృష్టం లో దురదృష్టం అన్నట్లుగా పాపం వచ్చిన సినిమా ఆఫర్లు పెద్దవే అయినప్పటికీ ఆ సినిమాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. నాగబంధం విడుదల అయినప్పటికీ ఆ సినిమా వల్ల నభా నటేష్‌కి పెద్దగా కలిసి రాలేదు. అంతే కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్న నభా నటేష్‌కి ఆ సినిమాలు ఎప్పటికి వస్తాయి అనే క్లారిటీ లేదు. ఆ సినిమాలు వస్తే తప్ప కొత్త సినిమా ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఫామ్‌లోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అనుకున్న నభా నటేష్‌ ఆశలపై నీళ్లు జల్లినట్లుగా నాగబంధం సినిమా చేసిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News