సాంప్రదాయ లుక్‌లో నభా నటేష్.. చూపు తిప్పుకోలేని ఎలిగెన్స్!

పద్ధతిగల చీరకట్టులో, బంగారు ఆభరణాలు ధరించి చందమామలా మెరిసిపోతున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Update: 2026-09-03 17:50 GMT

టాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్' సినిమాతో 'ఇస్మార్ట్ బ్యూటీ'గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి నభా నటేష్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. మోడర్న్ డ్రెస్సుల్లోనే కాకుండా సంప్రదాయ దుస్తుల్లో కూడా తాను ఎంత అందంగా ఉంటానో నిరూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పద్ధతిగల చీరకట్టులో, బంగారు ఆభరణాలు ధరించి చందమామలా మెరిసిపోతున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

రస్ట్ ఆరెంజ్ శారీలో సాంప్రదాయ సౌందర్యం:

తాజా ఫోటోషూట్ కోసం నభా నటేష్ రస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్, దానికి తగ్గట్టుగా ఉన్న ఎంబ్రాయిడరీ డ్రేప్డ్ శారీని ఎంచుకుంది. బంగారం, పలు రంగులతో చేసిన డిజైనింగ్ వర్క్ ఆమె అవుట్‌ఫిట్‌కు రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది. దీనికి మ్యాచింగ్‌గా ఉన్న బ్లాక్ పోల్కా-డాట్ గార్మెంట్ కూడా ఈ డ్రెసింగ్‌కు ప్రత్యేకమైన ఆకర్షణను జోడించింది. ఇక స్టూడియో బ్యాక్‌డ్రాప్‌లో నభా ఇచ్చిన పోజులు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

 

లేయర్డ్ జ్యువెలరీ అండ్ క్లాసిక్ మేకప్:

ఈ సంప్రదాయ దుస్తులకు మరింత అందాన్ని తీసుకొచ్చేలా నభా భారీ బంగారు ఆభరణాలను ధరించింది. మెడలో లేయర్డ్ గోల్డ్ నెక్లేస్, చెవులకు మెరిసే మోడల్ కమ్మలు, చేతులకు గాజులు వేసుకుని పూర్తి పండుగ కళను నింపుకుంది. ఫ్యాషన్ డిజైనర్ నిహా వర్మ స్టైలింగ్ చేసిన ఈ లుక్‌లో నభా చిందించిన ప్రశాంతమైన హావభావాలు, క్లాసిక్ మేకప్ ఆమె ఎలిగెంట్‌ను రెట్టింపు చేశాయి.

 

'ఇస్మార్ట్ శంకర్' నుంచి నేటి వరకు కెరీర్:

కన్నడ చిత్రం 'వజ్రకాయ'తో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నభా, 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్‌గా మారింది. ఇక ఆ తర్వాత 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో', 'డార్లింగ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

 

చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు:

గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన క్యారెక్టర్లు ఎంచుకుంటున్న నభా, ప్రస్తుతం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' అనే పాన్ ఇండియా అడ్వెంచర్ ఫిల్మ్‌లో పార్వతి పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు 'స్వయంభూ' అనే పీరియడ్ ఎపిక్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక తమ అభిమాన నటి నభా నటేష్ ఇలాంటి సాంప్రదాయ ఫోటోషూట్లతో ఇంటర్నెట్‌ను మైమరపిస్తూ, రాబోయే రోజుల్లో పెద్ద ప్రాజెక్టులతో వెండితెరపై భారీ విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News