సంప్రదాయ లుక్‌లో సూపర్ గ్లామ్... నభా నటేష్ పిక్స్ వైరల్
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన బ్యూటీ నభా నటేష్, ప్రస్తుతం తన లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన బ్యూటీ నభా నటేష్, ప్రస్తుతం తన లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తన కొత్త సినిమా సంతోషాన్ని పంచుకుంటూ, తాజాగా నభా షేర్ చేసిన ట్రెడిషనల్ బ్రైడల్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. గులాబీ రంగు లెహంగాలో దేవకన్యలా మెరిసిపోతున్న నభా లుక్, అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఆ విశేషాలు చూద్దాం..
గులాబీ రంగులో వెలిగిపోతున్న నభా:
ఈ సరికొత్త ఫోటోషూట్‌లో నభా నటేష్ అచ్చమైన భారతీయ సంప్రదాయ వధువు లుక్‌లో దర్శనమిచ్చింది. రోజ్ పింక్ కలర్ లెహంగా దుస్తులు, దానికి మ్యాచింగ్ హెవీ జ్యువెలరీ ధరించి ఎంతో రాయల్‌గా కనిపిస్తోంది. ఇక తలలో మల్లెపూలు, పొడవైన జడ వేసుకుని, ముఖంలో వెలిగిపోతున్న నవ్వుతో నభా ఇచ్చిన పోజులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
లెహంగా డిజైన్ ముచ్చట్లు:
నభా వేసుకున్న ఈ బ్రైడల్ అవుట్‌ఫిట్ డిజైన్ చాలా రిచ్‌గా ఉంది. దట్టమైన పూల ఎంబ్రాయిడరీ, మెరిసిపోయే జరీ వర్క్‌తో ఉన్న మోడ్రన్ కార్సెట్ స్టైల్ బ్లౌజ్ మరియు దానికి మ్యాచ్ అయ్యేలా నిలువుగా పూల డిజైన్ ఉన్న హై వేస్టెడ్ ఏ లైన్ స్కర్ట్ ఆమె గ్లామర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఇక భుజంపై నుండి జాలువారుతున్న తేలికపాటి నెట్ దుపట్టా ఈ లుక్‌కి పర్‌ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చింది.
'పార్వతి' క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్:
ప్రస్తుతం థియేటర్లలో మల్టీ-లాంగ్వేజెస్‌లో దూసుకుపోతున్న ప్యాన్-ఇండియా ఫిల్మ్ 'నాగబంధం లో నభా నటేష్ 'పార్వతి' అనే పవర్‌ఫుల్ పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నభా ఎంతో ముగ్ధురాలైంది. "ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే వెంటనే థియేటర్లలో చూసేయండి" అంటూ ఈ ఫోటోల ద్వారా ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పింది.
కన్నడ టు టాలీవుడ్ ప్రయాణం:
ఇక 2015లో కన్నడ సినిమా వజ్రకాయ తో కెరీర్ స్టార్ట్ చేసిన నభా, నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత వచ్చిన చిత్రాలతో తన నటన, డ్యాన్స్ స్కిల్స్ మరియు వైవిధ్యాన్ని నిరూపించుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ లీడింగ్ లేడీగా కొనసాగుతోంది.
ప్రస్తుతం నభా నటేష్ చేతిలో మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్వయంభూ' తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఫ్యాషన్ ట్రీట్ ఇవ్వడంలో నభా ఎప్పుడూ ముందే ఉంటుంది.ఇక గ్లామర్, యాక్టింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలనని నభా ఈ ట్రెడిషనల్ అండ్ సూపర్ గ్లామ్ ఫోటోషూట్‌తో మరోసారి ప్రూవ్ చేసింది..