సినిమాకు పబ్లిసిటీ : అవసరమా? అన‌వ‌స‌ర‌మా?

విపరీతమైన హైప్ సృష్టించి విడుదలైన ఎన్నో సినిమాలు కంటెంట్ లోపించడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

Update: 2026-08-12 08:53 GMT

సినిమా రంగంలో ఎంత ప్రతిభావంతులైన ద‌ర్శ‌క‌, న‌టులున్నా? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ప్రచారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక కాలంలో సినిమాలు వినోద సాధనాలుగా మాత్రమే కాకుండా కోట్ల రూపాయల వ్యాపారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏ సినిమాకైనా పబ్లిసిటీ ఖచ్చితంగా అవసరమా? లేక కేవలం కంటెంట్ ఉంటే సరిపోతుందా? అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

ఒకప్పుడు సినిమా బాగుంటే మౌలిక ప్రచారం ద్వారానే విజయవంతమయ్యేవి. కానీ నేడు రోజువారీ విడుదలయ్యే చిత్రాలు, సోషల్ మీడియా హడావుడి మధ్య ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించడం అంత తేలికైన విషయం కాదు. టీజర్లు, ట్రైలర్లు, సాంగ్ లాంచ్‌లు , ఇంటర్వ్యూల ద్వారా సినిమాపై అంచనాలు పెంచితేనే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా ఎంత గొప్పగా ఉన్నా? దాని ఉనికిని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి పబ్లిసిటీ అనేది ప్రాణాధారంగా మారింది.

మరోవైపు పబ్లిసిటీ మాత్రమే సినిమాను శాశ్వతంగా నిలబెట్టలేదనేది కూడా వాస్తవమే. విపరీతమైన హైప్ సృష్టించి విడుదలైన ఎన్నో సినిమాలు కంటెంట్ లోపించడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అతిగా చేసిన ప్రచారం కొన్నిసార్లు ప్రేక్షకులలో అవాస్తవిక అంచనాలను సృష్టించి సినిమా అంచనాలను అందుకోలేకపోతే తిరోగమనానికి దారితీస్తుంది. కేవలం ప్రచారం ద్వారానే సినిమాను నెట్టుకురావడం దీర్ఘకాలంలో సాధ్యపడదు.

అయితే డిజిటల్ యుగంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ , వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పోటీ తీవ్రమైంది. ఈ రద్దీలో చిన్న సినిమాలైనా? పెద్ద సినిమాలైనా? ఉనికిని చాటుకోవాలంటే వినూత్నమైన మార్కెటింగ్ వ్యూహాలు తప్పనిసరి. సాంప్రదాయ ప్రకటనలే కాకుండా సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరవచ్చని నేటి నిర్మాతలు నిరూపిస్తున్నారు.

దీనిని బట్టి చూస్తే పబ్లిసిటీ - కంటెంట్ అనేవి ర‌ధానికి రెండు చక్రాల వంటివని అర్థమవుతుంది. కేవలం ప్రచారం ఉండి మంచి కథ లేకపోతే సినిమా నిలవదు. అద్భుతమైన కథ ఉన్నా? దాన్ని ప్రజలకు చేరవేయకపోతే ప్రయోజనం ఉండదు. ఈ రెండింటి సరైన సమతుల్యత పాటిస్తేనే ఏ చిత్రమైనా ? ఆర్థికంగా , కళాత్మకంగా విజయవంతం కాగలదు.

Tags:    

Similar News