షోల్డర్ లెస్ డ్రెస్ లో హీట్ పుట్టించిన మౌనీ.. ఈమె ధరించిన నెక్లెస్ కాస్ట్ ఎంతంటే?
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు దేశీయంగా ఆకట్టుకోవడమే కాకుండా విదేశాలలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్ లో సందడి చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు దేశీయంగా ఆకట్టుకోవడమే కాకుండా విదేశాలలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్ లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా తమ హుందాతనంతో.. లగ్జరీ దుస్తులు, ఆభరణాలతో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.. అలాంటివారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కూడా ఒకరు. నిత్యం గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వయ్యారి.. తాజాగా 2026 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం అత్యంత సుందరంగా, అందంగా లగ్జరీగా ముస్తాబయి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 రెడ్ కార్పెట్ పై సందడి చేయడానికి చాలా అందంగా ముస్తాబయింది మౌని రాయ్. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అభిమానులు అందానికి ఒక్కరికి అవుతున్నారు. తాజాగా వైట్ కలర్ నెట్టెడ్ షోల్డర్ లెస్ డ్రెస్ ధరించిన ఈమె టాప్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అతి క్లిష్టమైన లేస్ డీటెయిల్ తో అలంకరించబడిన ఈ డ్రెస్ ఆమె రూపానికి మరింత శోభను తీసుకొచ్చింది. ఇకపోతే కేన్స్ 2026 లో సందడి చేయడానికి ఆమె ధరించిన మూడవ లుక్ ఇది. ఇకపోతే ఈమె తన డ్రెస్ కి తగ్గట్టుగా డైమండ్స్ పొదిగిన చౌకర్ నెక్లెస్ ధరించి.. ఈ ఔట్ఫిట్ కి అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే డైమండ్స్ పొదిగిన వాచ్ ను కూడా ఆమె ధరించి మరింత అట్రాక్షన్ గా నిలిచింది.
ఇకపోతే ఈ కేన్స్ 2026 రెడ్ కార్పెట్ పై మళ్లీ నడవడానికి ఈమె ఎంచుకున్న ఈ దుస్తులు, ఆభరణాలు ఈమె అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా రాజసం ఉట్టిపడేలా చాలా విలాసవంతంగా ఉన్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మౌని రాయ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ధరించిన ఈ నెక్లెస్, పెట్టుకున్న వాచ్ పైనే అందరి దృష్టి పడింది. ఇక దీంతో ఈమె పెట్టుకున్న నెక్లెస్ ధర ఎంత ఉంటుంది అని అభిమానులు కూడా అప్పుడే గూగుల్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక హై జ్యువెలరీ సంస్థ డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఆభరణం ఇది. అంతేకాదు యాంటిక్ పీస్ గా డిజైన్ చేసే ఈ ఆభరణాన్ని పూర్తిగా వజ్రాలతో డిజైన్ చేశారు. కాబట్టి సుమారుగా రూ.15 నుండి రూ.35 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే కేన్స్ ఫెస్టివల్ లో సందడి చేయడమే కాకుండా తన గ్లామర్ లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొత్తానికైతే మౌని రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆమెని టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మార్చేస్తున్నాయని చెప్పవచ్చు.