ఈ బాధ భరించలేం.. ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న మోనాలిసా దంపతులు!

అలాగే ఒక తెలుగు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోనాలిసా. ఇలాంటి సమయంలో సడన్గా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ (Farman Khan) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.;

Update: 2026-03-26 05:34 GMT

ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో పూసలమ్ముకుంటూ ఒక్కసారిగా తన తేనెకళ్ళతో పాపులర్ అయిన మోనాలిసా (Monalisa ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒక్క లుక్ తో అందరినీ మాయ చేసిన ఈమెకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా (Sanoj Mishra) తన సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి మరీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. అలాగే ఒక ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ లో కూడా సందడి చేసిన ఈమె.. ఎక్కువగా కేరళ, తమిళనాడు లలో షాపు ఓపెనింగ్స్ చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

మోనాలిసా వల్లే మా కుటుంబం రోడ్డున పడింది - మోనాలిసా చెల్లి

అలాగే ఒక తెలుగు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోనాలిసా. ఇలాంటి సమయంలో సడన్గా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ (Farman Khan) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోలేదని , కేరళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అక్కడ కొంతమంది రాజకీయ నాయకుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇక ఈమె వివాహం చేసుకోవడంతో ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రా వీరిది లవ్ జిహాద్ అని , మోనాలిసా మైనర్ అని కామెంట్లు చేశారు. అంతేకాదు ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను తప్పుదోవ పట్టించి, ఆమెను వివాహం చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మోనాలిసా తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లి చెల్లదు అంటూ కామెంట్లు చేయగా.. మోనాలిసా చెల్లి తన అక్క వల్లే తమ కుటుంబం రోడ్డున పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మేం ఆత్మహత్య చేసుకుంటాం - మోనాలిసా దంపతులు

అయితే ఇప్పుడు ఈ ఆరోపణలపై మోనాలిసా దంపతులు స్పందించారు. తమ వివాహాన్ని లవ్ జిహాద్ అని పిలవకండి అంటూ వేడుకున్నారు. ఇక వీరిద్దరూ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి తాము ఎదుర్కొన్న కష్టాల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ.." నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. ముస్లిం మతానికి చెందిన వాడిని. ఇది తప్పా? చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ప్రేమించడం తప్పా? మమ్మల్ని ఇంతలా హింసిస్తారా? మా దగ్గర డబ్బు లేదు.. డబ్బు లేకుండా ఎలా బ్రతుకుతాం ? పనిచేయకపోతే ఏం తింటాం? మా దారిన మమ్మల్ని వదిలేయండి. ఒకవేళ మీరు ఇలాగే మమ్మల్ని వేధిస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం.. అదొక్కటే మాకు గతి".

ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి - మోనాలిసా దంపతులు

మా పెళ్లి గుడిలో జరిగింది. నాకు శ్రీ నారాయణ గురూజీ అంటే బాగా నమ్మకం.. ఎవరైనా ఆయన గుడికి వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. పూజలు చేసుకోవచ్చు.. అంటూ ఫర్మాన్ ఖాన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఢిల్లీ , మధ్యప్రదేశ్ , కేరళ ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి. లేకపోతే మేం ఆత్మహత్య చేసుకుంటాము అంటూ మోనాలిసా కూడా హెచ్చరించింది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది. మొత్తానికైతే ఫర్మాన్ ఖాన్ - మోనాలిసా దంపతులు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News