ఆ హాట్ బ్యూటీతో డేటింగ్.. అడ్డంగా దొరికిన సిరాజ్
టీమిండియా స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం మైదానంలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ సెన్సేషన్‌గా మారాడు.;
టీమిండియా స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం మైదానంలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ సెన్సేషన్‌గా మారాడు. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లను పడగొట్టే ఈ 'హైదరాబాదీ మియా'.. ఇప్పుడు నెటిజన్ల మనసుల్లో కొత్త చర్చకు తెరలేపాడు. ప్రముఖ టీవీ నటి, 'బిగ్ బాస్' ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
వైరల్ వీడియోతో మొదలైన రచ్చ
క్రికెటర్లు, సినీ తారల మధ్య ప్రేమాయణాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, సిరాజ్ వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ ఒక రకమైన గోప్యత ఉండేది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్ బయట సిరాజ్, మహిరా శర్మ కలిసి కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. కేవలం రెస్టారెంట్ మాత్రమే కాకుండా వారు ఒకే ప్రాంతంలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న మరికొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.
గతంలోనూ ఇదే తరహా పుకార్లు
నిజానికి సిరాజ్-మహిరాల గురించి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది కూడా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో మహిరా శర్మ స్పందిస్తూ తామిద్దరం కేవలం స్నేహితులమేనని, తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. సిరాజ్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ.. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని కోరాడు. కానీ ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించడంతో అభిమానుల్లో సందేహాలు రెట్టింపయ్యాయి.
ప్రేమనా? లేక కేవలం స్నేహమా?
మహిరా శర్మ కేవలం 'బిగ్ బాస్' మాత్రమే కాకుండా పంజాబీ మ్యూజిక్ వీడియోలు, హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు సిరాజ్ టీమిండియాలో స్టార్ బౌలర్‌గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా వీరిద్దరూ మళ్లీ జంటగా కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో!" అని కొందరు అంటుంటే "సెలబ్రిటీలు కలిసిన ప్రతిసారీ అది ప్రేమే అవ్వాలని లేదు.. అది కేవలం స్నేహం కావచ్చు" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మౌనంగానే ఉన్న జంట
ఈ తాజా వివాదంపై అటు మహమ్మద్ సిరాజ్ కానీ, ఇటు మహిరా శర్మ కానీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఐపీఎల్ , అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న సిరాజ్ తన ఆటపైనే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తున్నా, బయట జరుగుతున్న ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అహ్మదాబాద్ వేదికగా ఏదైనా షూటింగ్ నిమిత్తం కలిశారా లేక పర్సనల్ వెకేషనా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికి 'క్రికెట్ - గ్లామర్' ప్రపంచాల మధ్య ఈ కొత్త రిలేషన్‌షిప్ టాపిక్ ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది. మరి ఈ సారి కూడా వీటిని పుకార్లుగానే కొట్టిపారేస్తారా? లేక తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారా? అనేది వేచి చూడాలి.