నెవ్వర్ బిఫోర్: 90 మంది డ్రామా ఆర్టిస్టులతో మ‌హిళా దర్శకురాలు ప్రయోగం

సినిమా రంగంలో స్టేజీ ఆర్టిస్టుల‌కు ఉండే గౌర‌వ‌మే వేరు. నాట‌కాల‌తో అద్భుత‌మైన ఆహార్యం, ఆంగికం, వాచ‌కం వృద్ధి చెందుతాయి. స్టేజీ డ్రామా క‌ళాకారుల‌తో ప‌ని చేయ‌డం ద‌ర్శ‌కుల‌కు కూడా సుల‌వుగా ఉంటుంది.

Update: 2026-07-08 05:30 GMT

సినిమా రంగంలో స్టేజీ ఆర్టిస్టుల‌కు ఉండే గౌర‌వ‌మే వేరు. నాట‌కాల‌తో అద్భుత‌మైన ఆహార్యం, ఆంగికం, వాచ‌కం వృద్ధి చెందుతాయి. స్టేజీ డ్రామా క‌ళాకారుల‌తో ప‌ని చేయ‌డం ద‌ర్శ‌కుల‌కు కూడా సుల‌వుగా ఉంటుంది. త్వ‌ర‌గా అర్థం చేసుకుని దానిని సీన్ లో పండించ‌డానికి వారు అంత‌గా శ్ర‌మించ‌రు. కార‌ణం ఏదైనా ఇప్పుడు త‌న సినిమా కోసం ఏకంగా 90 మంది స్టేజీ ఆర్టిస్టుల‌ను ఎంపిక చేసి రికార్డ్ బ్రేక్ చేసారు మేఘ‌నా గుల్జార్. మ‌హిళా ద‌ర్శ‌కురాలిగా పేరున్న మేఘ‌న ప్ర‌యోగం గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఒక‌టే చ‌ర్చ సాగుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకూమారన్ ప్రధాన పాత్రల్లో `దాయరా`ను యూనిక్ ఫిలింగా తీర్చిదిద్దేందుకు మేఘనా గుల్జార్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మేఘ‌నా ప్రయోగం ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రపంచాన్ని ఎంతో సహజంగా, యథార్థంగా వెండితెరపై ఆవిష్కరించడం కోసం మేఘనా గుల్జార్ ఏకంగా 90 మంది రంగస్థల (థియేటర్) నటీనటులను ఎంపిక చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

సాధారణంగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం జూనియర్ ఆర్టిస్టులను లేదా స్థానిక నటులను తీసుకుంటూ ఉంటారు. కానీ `దాయరా` సినిమాలో ప్రతి ఒక్క పాత్ర ఎంతో నమ్మశక్యంగా, జీవం ఉన్నట్లుగా ఉండాలనేది దర్శకురాలి ఆకాంక్ష. అందుకోసమే కేవలం ఒకే ఒక్క సీన్ లేదా ఒకే ఒక్క డైలాగ్ ఉన్న పాత్రలకు కూడా దర్శకురాలు మేఘనా గుల్జార్ స్వయంగా కఠినమైన ఆడిషన్స్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్ కథను బలంగా ముందుకు నడిపించేలా డిజైన్ చేశారని చిత్ర బృందం పేర్కొంది.

ఈ ప్రయోగాత్మక చిత్రంలో సుమారు 75 మాట్లాడే పాత్రలు ఉన్నాయి. వీటి కోసం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్.ఎస్.డి), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప‌లు ప్రముఖ థియేటర్ గ్రూపుల నుండి అద్భుతమైన ప్రతిభ గల నటులను సేకరించారు. కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా కథలోని వైవిధ్యాన్ని, సహజత్వాన్ని ప్రతిబింబించేలా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల నుండి నటులను ఎంపిక చేసి ఒకే యూనిట్‌గా మలిచారు. ఒక రకంగా ఇది పాన్-ఇండియా నటీనటుల సమూహంగా మారింది.

ఇక ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. జంక్లీ పిక్చర్స్ - పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని క్రైమ్, జస్టిస్ , శిక్ష వంటి అత్యంత ఆసక్తికరమైన అంశాల చుట్టూ తిరిగే ఒక హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ పవర్‌ఫుల్ కథలో 17 ఏళ్ల ఒక నూతన నటుడు కూడా కీలక పాత్ర ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

భారీ అంచనాలున్న ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. పెన్ మరుధర్ పంపిణీలో `దాయరా` చిత్రం 18 సెప్టెంబర్ 2026 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకూమారన్ ల నటనతో పాటు.. 90 మంది థియేటర్ ఆర్టిస్టుల ప్రతిభ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News