పెళ్ళైన నటీమణుల బోల్డ్ పాత్రలు: సమాజం ఆలోచనలు ఎలా మారుతున్నాయి?

సినిమా రంగంలో నిరంతరం మారుతున్న కాలంతో పాటు ట్రెండ్స్ కూడా మారుతున్నాయి.

Update: 2026-10-06 19:30 GMT

సినిమా రంగంలో నిరంతరం మారుతున్న కాలంతో పాటు ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు వివాహం అనంత‌రం జరిగిన హీరోయిన్లు సినిమాలకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పాత భావనలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లయిన తర్వాత కూడా అగ్రశ్రేణి కథానాయికలు ఇండస్ట్రీలో కొనసాగుతూ సత్తా చాటు తున్నారు. అయితే వివాహం తర్వాత నటీమణులు రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించడం సరైనదేనా? అనే చర్చ మాత్రం తరచూ తెరపైకి వస్తూనే ఉంటుంది.

ఈ అంశంపై సమాజంలో , సినీ పరిశ్రమలో రెండు రకాల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం వారి ఆలోచన ప్రకారం సినిమా అనేది ఒక కళా రూపం మాత్రమే. అందులో నటించేటప్పుడు పాత్ర డిమాండ్ మేరకు ప్రవర్తించాల్సి ఉంటుందని భావిస్తారు. పెళ్లికి ముందు ఎలాగైతే నటి వృత్తిధర్మం మేరకు నటిస్తుందో? పెళ్ళైన తర్వాత కూడా అదే వృత్తిపరమైన నిబద్ధతను కొనసాగించడంలో తప్పులేదని ఈ కోణంలో వాదిస్తారు.

మరోవైపు సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేసే మరో వర్గం మాత్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది. వివాహ బంధం అనేది పవిత్రమైన బంధమని, కుటుంబ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని హద్దులు ఉంటాయని అభిప్రాయపడతారు. వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఈ తరహా సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులలో కొన్నిసార్లు అసౌకర్యానికి గురిచేసే అవకాశం ఉందని ఈ వాదనను సమర్థించేవారు పేర్కొంటారు.

అయితే ఈ విషయాలన్నింటికంటే ముఖ్యంగా ఇది పూర్తిగా ఆయా నటీమణుల వ్యక్తిగత నిర్ణయం , వారి కుటుంబాల అవగాహనపై ఆధారపడి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏ నటి అయినా ? కెరీర్ గురించి స్వయంగా నిర్ణయం తీసుకోగలదు. పాత్రల ఎంపికలో హద్దులు నిర్ణయించుకోవడం.. ఎలాంటి కథలను ఎంచుకోవాలనే ? స్వేచ్ఛ పూర్తిగా ఆ నటికి మాత్రమే ఉంటుంది.

కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల ఆలోచనా విధానంలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. కేవలం నటీమణుల వైవాహిక స్థితిని బట్టి కాకుండా వారి నైపుణ్యాన్ని, ప్రతిభను మాత్రమే ప్రేక్షకులు కొలమానంగా తీసుకుంటున్నారు. పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారనేదే ముఖ్యం కానీ పెళ్లి తర్వాత ఏ సీన్ చేయాలి? ఏది చేయకూడదు? అనేది ప్రేక్షకులు నిర్ణయించలేరు. నటి ప్రతిభే ఆమెను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబెడుతుంది.

అంతిమంగా వివాహం తర్వాత ఇంటిమేట్ సీన్స్ చేయడం సరైనదా? కాదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం క‌ష్టం. ఇది ఎవరి వ్యక్తిగత నైతిక విలువలు, ఆలోచనలు , వృత్తిపరమైన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. కళను కళలా ఆస్వాదించే వాతావరణం బలపడినంత కాలం ఈ చర్చలకు కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News