స్టార్ హీరో ఫ్యాన్స్‌కు డైరెక్ట‌ర్ షాకింగ్ సర్ప్రైజ్!

సామాజిక అంశాలు.. అణచివేతస్టాకు గురైన వర్గాల ఆవేదనను వెండితెరపై ఎంతో ఇంటెన్సిటీతో ఆవిష్కరించే దర్శకుడిగా మారి సెల్వరాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Update: 2026-05-26 11:30 GMT

సామాజిక అంశాలు.. అణచివేతస్టాకు గురైన వర్గాల ఆవేదనను వెండితెరపై ఎంతో ఇంటెన్సిటీతో ఆవిష్కరించే దర్శకుడిగా మారి సెల్వరాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన గత చిత్రం `వాళై` బాక్సాఫీస్ వద్ద ఎలాంలి విజ‌యం సాధించిందో తెలిసిందే. విమర్శకుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్న చిత్రంగా నిలిచింది. త‌న చిన్ననాటి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించిన సినిమా ఓ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `వాళై 2` చేసేందుకు మారి సెల్వరాజ్ సన్నాహాలు చేస్తున్నట్లు వ‌స్తోన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

మారి సెల్వరాజ్ తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `కర్ణన్` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ధనుష్- మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ కాంబో రిపీట్ అవుతుంద‌ని.. త్వ‌ర‌లో పట్టాలెక్కేస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్.. ధ్రువ్ విక్రమ్‌తో చేస్తున్న `బైసన్` చిత్రం పూర్తి కాగానే ధనుష్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ మారి సెల్వరాజ్ డైరీలో తాజాగా `వాళై 2` వచ్చి చేరడంతో సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది.

`వాళై` మొదటి భాగంలో కథ ముగిసిన తీరు అటుపై హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలను పార్ట్-2 లో చూపించాల్సిన అవసరం ఉందని మారి బలంగా భావిస్తున్నారట. తన వ్యక్తిగత కథ కావడంతో దీనిపై ఆయనకు మరింత ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే `బైసన్` సినిమా పూర్త‌యిన వెంట‌నే ధనుష్ సినిమా కంటే ముందే ఈ చిన్న బడ్జెట్ ఎమోషనల్ డ్రామాను వేగంగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామం ధనుష్ అభిమానులలో కొంత నిరాశను, మరికొంత సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది. ధనుష్ ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ కనుక మరింత ఆలస్యమైతే ధనుష్ లైనప్‌లోని వేరే సినిమాలకు డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. దీంతో ఇద్ద‌రి క్రేజీ కాంబినేషన్ మరికొంత‌ కాలం వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే మారి సెల్వరాజ్ `వాళై 2`ను చాలా తక్కువ వర్కింగ్ డేస్‌లోనే తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేసేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.

కమర్షియల్ హంగులు, బడా స్టార్ల ఇమేజ్ కంటే కంటెంట్ -తన మనసుకు నచ్చిన కథలకే మారి సెల్వరాజ్ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. `వాళై` లాంటి హార్ట్ టచింగ్ మూవీకి సీక్వెల్ రావడం సినిమా లవర్స్‌కు సంతోషాన్ని కలిగించే విషయమే అయినా? ట్రేడ్ పరంగా ధనుష్ సినిమాపై ఉన్న బిజినెస్ అంచనాలు వేరు. ఒక స్టార్ హీరో సినిమాను హోల్డ్‌లో పెట్టి తన పర్సనల్ డ్రీమ్ ప్రాజెక్ట్ సీక్వెల్‌ను ముందుకు తీసుకురావడం మారి సెల్వరాజ్ మార్క్ మేకింగ్ ధైర్యానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News