మంచు మనోజ్ గొప్ప నిర్ణయం.. అసలైన హీరోగా..

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి కలిసి సమాజ సేవ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Update: 2026-05-17 11:36 GMT

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి కలిసి సమాజ సేవ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ముందే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'ఐక్య ధైర్య సేన సమితి' AIKYA పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

మౌనిక ఆలోచనల నుంచి పుట్టిన ఈ సంస్థను తమ హృదయానికి చాలా దగ్గరైన విషయంగా వారు పేర్కొన్నారు. ఈ సంస్థ పూర్తిగా మానవత్వం, సేవా భావంతో పనిచేస్తుందని మనోజ్ స్పష్టం చేశారు. సమాజంలో కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడం, అవసరమైన వారికి సహాయం అందించడమే ఈ సమితి ముఖ్య ఉద్దేశం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం, ఎమర్జెన్సీ సమయాల్లో హెల్ప్ చేయడం, నిరుపేదలకు సపోర్ట్ ఇవ్వడం లాంటి పనులను ఈ సంస్థ ద్వారా చేయబోతున్నారు.

ఎక్కడ సహాయం కావాలన్నా తమ సంస్థ ముందుంటుందని మనోజ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత మనుషుల మధ్య ఉండే బంధం, మానవత్వం మాత్రమే నిజమైనవని తమకు అర్థమైందని అన్నారు. తమ ఇళ్ల తలుపులు ఎప్పుడూ సహాయం కోరే వారి కోసం తెరిచే ఉంటాయని, ఇప్పుడు ఆ నమ్మకానికి ఒక పేరు పెట్టి మరింత మందిని ఈ ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నట్లు వివరించారు.

ఈ సంస్థ ద్వారా ఒకరికొకరు తోడుగా ఉంటూ సమాజంలో మార్పు తీసుకురావచ్చని వారు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ సంస్థకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని మనోజ్ చాలా క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఇది నిజాయితీగా సేవా దృక్పథంతో నడిచే ఆర్గనైజేషన్ అని, కేవలం తమది మాత్రమే కాకుండా మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ అని చెప్పారు. సమాజం కోసం మంచి చేయాలనే తపన ఉన్న ఎవరైనా ఈ సంస్థతో కలిసి నడవచ్చని పిలుపునిచ్చారు.

హృదయాలు కలిసినప్పుడు జీవితాలు మారడమే కాకుండా కొత్త ఆశలు చిగురిస్తాయని మనోజ్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఇక మనోజ్, మౌనిక తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు సినీ వర్గాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం మిగతా వారికి ఒక మంచి ఇన్సిపిరేషన్ అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సంస్థ లోగో కూడా చాలా అర్ధవంతంగా, ఐక్యతను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఈ 'ఐక్య' సంస్థ ద్వారా మరెన్నో మంచి పనులు జరగాలని మరికొందరు నెటిజన్లు విషెస్ అందిస్తున్నారు.




Tags:    

Similar News