ఇండస్ట్రీ ట్రెండ్: తండ్రీ కొడుకుల కాంబినేషన్లో వచ్చిన మూవీస్!

తెలుగు సినిమాల్లో హీరోలను ఎంతో అభిమానించే ఫ్యాన్స్, వారి వారసులు కూడా ఇండస్ట్రీలోకి వస్తే మరింత ఆనందం వ్యక్తం చేస్తారు.

Update: 2026-05-26 19:30 GMT

తెలుగు సినిమాల్లో హీరోలను ఎంతో అభిమానించే ఫ్యాన్స్, వారి వారసులు కూడా ఇండస్ట్రీలోకి వస్తే మరింత ఆనందం వ్యక్తం చేస్తారు. ఒకే స్క్రీన్‌పై నిజ జీవిత తండ్రీ కొడుకులను కలిపి చూస్తే వచ్చే ఆ మజానే వేరు. ఎన్టీఆర్-బాలకృష్ణ ల కాలం నుండి నేటి రామ్ చరణ్-చిరంజీవి వరకు వెండితెరపై తండ్రీకొడుకులు కలిసి సందడి చేసిన సినిమాలు ఎప్పుడూ ఇండస్ట్రీలో ఒక హాట్ ట్రెండే. మరి అలాంటి కొన్ని క్రేజీ సినిమాల ముచ్చట్లు ఇప్పడు చూద్దాం..

క్లాసిక్ మ్యాజిక్.. ‘మనం’:

అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి నటించిన అద్భుతమైన సినిమా 'మనం' (2014). లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ముగ్గురూ కలిసి ఇందులో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెండితెరపై ఈ ముగ్గురి కెమిస్ట్రీ, టైం ట్రావెల్ సెంటిమెంట్ కథ ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

 

మెగా పవర్ ప్యాక్:

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే థియేటర్లలో పూనకాలు వస్తాయి. ఇక వీరిద్దరూ కలిసి 'బ్రూస్ లీ' సినిమాలో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకుని ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. చరణ్ హీరోగా నటిస్తుండగా, చిరంజీవి తన స్టైలిష్ ఎంట్రీతో థియేటర్లను షేక్ చేశారు. అలాగే వీరు 'ఆచార్య' అనే ఫుల్ లెంగ్త్ సినిమాలోనూ కలిసి నటించారు.

 

కృష్ణ - మహేష్ బాబుల క్రేజ్:

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కృష్ణగారితో కలిసి 'కొడుకు దిద్దిన కాపురం' లాంటి ఎన్నో సినిమాల్లో తండ్రీకొడుకులుగా అదరగొట్టారు. ఇక ఆ తర్వాత మహేష్ హీరో అయ్యాక కూడా వంశీ, టక్కరి దొంగ సినిమాల్లో ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటించి మురిపించారు.

 

మంచు ఫ్యామిలీ ‘పాండవులు’:

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్ ముగ్గురూ కలిసి నటించిన పక్కా కమర్షియల్ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద', కన్నప్ప మూవీలో ఒకే ఫ్రేమ్‌లో తండ్రి, ఇద్దరు కొడుకులు పోటీ పడి మరీ కామెడీ, యాక్షన్ సీన్స్‌లో నటించి ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్‌టైన్ చేశారు.




 


దగ్గుబాటి మామ-అల్లుళ్ల సందడి:

'కృష్ణం వందే జగద్గురుమ్' (2012) సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక చిన్న గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిశారు. ఒక స్పెషల్ సాంగ్‌లో బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా కలిసి చేసిన హంగామా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది.




 


నిజ జీవితంలో తండ్రీకొడుకులైన వారు వెండితెరపై కూడా కలిసి కనిపిస్తే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. కథలు ఎలా ఉన్నా, తమ ఫేవరెట్ హీరోలను అలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు కంటి నిండా పండగే. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రేజీ కాంబినేషన్లు మరెన్నో వచ్చి మనల్ని అలరించాలని కోరుకుందాం..

Tags:    

Similar News