ఆసక్తి రేకెత్తిస్తున్న మహాకాళి గ్లింప్స్.. శుక్రాచార్యుడి ఏడుపు.. వార్ ఆరంభం!
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ విషయానికి వస్తే.. శుక్రాచార్యుడి పాత్ర మాట్లాడుతూ.." అమృత మథన సమయంలో దేవతలతో సమానంగా అసురులు శ్రమించినా..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ఇప్పుడు అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హను- మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా అవతరించిన తేజ సజ్జ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించారు. ఈ సినిమా సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ.. ఆ పోటీని తట్టుకొని హను-మాన్ పాన్ ఇండియా వైడ్ రికార్డు సృష్టించింది అంటే ఈ సినిమాకి ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోవచ్చు.
మహాకాళి మూవీ నుండి అదిరిపోయే గ్లింప్స్..
అలాంటి ఈ సినిమాటిక్ యూనివర్స్ నుండి మహాకాళి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. మహాకాళి మూవీ నుండి శుక్రాచార్యుడి పాత్రను రివీల్ చేస్తూ ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా, మహాకాళిగా శ్రియా రెడ్డి కనిపించిన ఈ గ్లింప్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఒక్కసారిగా పౌరాణిక, ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
యుద్ధం ప్రకటించిన శుక్రాచార్యుడు..
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ విషయానికి వస్తే.. శుక్రాచార్యుడి పాత్ర మాట్లాడుతూ.." అమృత మథన సమయంలో దేవతలతో సమానంగా అసురులు శ్రమించినా.. విష్ణువు ఆ అమృతాన్ని కేవలం దేవగణానికే ప్రసాదించాడు. ఇది ధర్మమా? అధర్మమా.. ?"అంటూ అక్షయ్ ఖన్నా పలికిన డైలాగ్స్, ఆయన ఎంట్రీ సీన్ సినిమా స్థాయిని మరింత పెంచేసాయి." 14 లోకాల ద్వారాలను తెరిచి అసురులకు శాశ్వత విముక్తి కల్పించాలంటూ.. రక్తబీజుడిని మేల్కొల్పి మానవజాతి పైకి యుద్ధానికి పురిగొల్పే" సీక్వెన్స్ రోమాంచితంగా సాగింది. అక్షయ్ ఖన్నా ఇంటెన్స్ లుక్, రాక్షస గురువుగా ఆయన స్వాగ్ విజువల్స్ చాలా అద్భుతంగా పడ్డాయి.
మహాకాళి గెటప్లో లీనమైన శ్రియా రెడ్డి..
గ్లింప్స్ చివరిలో మహాకాళి అమ్మవారు.. ఒడిలో బిడ్డను లాలిస్తూనే అమ్మవారు ఉగ్రరూపం దాల్చి ఆయుధాలతో దర్శనమిచ్చే మహాకాళి అవతారంలో.. శ్రియా రెడ్డి లుక్కు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వెంటనే "పెద్దమ్మ చూస్తుందిరా!" అంటూ వచ్చే టైటిల్ వాయిస్ ఓవర్ అదిరిపోయే హైప్ ఇస్తోంది. అమ్మ వారి గెటప్లో శ్రియా రెడ్డిని చూపించిన తీరు నిజంగా ఎవరు ఊహించి ఉండరు. అంత చక్కగా ఆ పాత్రకు ఆమె సరిపోయారు. మొత్తానికి అయితే ప్రశాంత్ వర్మ విజన్ , హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్, భారీ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయని తెలుస్తోంది.
మహాకాళి రిలీజ్ డేట్ లాక్..
ఈ భారీ దృశ్య కావ్యాన్ని వచ్చే ఏడాది అనగా 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 3డీలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా, రిజ్వాన్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.