ఓన్లీ యాడ్స్ రెవెన్యూ 20కోట్లు.. ఫ్లాప్‌తో మొదలైన నటి కీర్తి కిరీటం!
ట్యాలెంటెడ్ బ్యూటీ కృతి సనోన్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించింది.
ట్యాలెంటెడ్ బ్యూటీ కృతి సనోన్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించింది. మహేష్ (1నేనొక్కడినే), ప్రభాస్ (ఆదిపురుష్) లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. ఈ భామకు సోషల్ మీడియాల్లోను విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక ఫ్లాప్ సినిమాతో మొదలైన ఈ నటి ప్రస్తుతం అగ్ర కథానాయికగా ఏల్తోంది. నటిగానే కాకుండా వాణిజ్య ప్రకటనల ప్రపంచంలోనూ అత్యధిక డిమాండ్ ఉన్న తారగా దూసుకెళుతోంది. తన నటన, యాటిట్యూడ్, గ్లామర్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ఇటీవలి కాలంలో చాలా పాపులర్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓషియన్ ఫ్రూట్ వాటర్, గివా రాఖీ కలెక్షన్, యునిక్లో వంటి కార్పొరెట్ వాణిజ్య ప్రకటనలలో హల్ చల్ చేస్తోంది.
కృతి దూకుడు చూస్తుంటే నాలుగు చేతులా ఆర్జిస్తోందని చెప్పొచ్చు. వాణిజ్య ప్రకటనల ద్వారా కృతి సనోన్ ఆర్జిస్తున్న ఆదాయం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఈ భామ ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి లేదా ప్రకటనకు సుమారు ఒక 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ముప్పైకి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ వాణిజ్య ప్రకటనల రంగాన్ని శాసిస్తోంది.
ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే కృతి సనోన్‌కు భారీగా వార్షిక ఆదాయం సమకూరుతోంది. ప్రకటనల రూపంలోనే ఈ భామకు ఏడాదికి దాదాపు 20 కోట్ల వరకు సంపాదిస్తున్నారని అంచనా. ఈ లెక్కన కేవలం బ్రాండ్ ప్రమోషన్ల ద్వారానే నెలకు సగటున 2.5 కోట్ల వరకు ఆదాయాన్ని పొందుతుండటం బ్రాండ్స్‌లో తనకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఇక వెండితెరపై సినిమాల విషయానికి వస్తే.. కృతి సనోన్ తన సక్సెస్ గ్రాఫ్‌ను బట్టి రీసెంట్‌గా రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా పెంచేశారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 6 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ బడ్జెట్ .. తన పాత్ర ప్రాధాన్యతను బట్టి భారీ పాన్-ఇండియా చిత్రాలకు పారితోషికం 10 కోట్ల మార్కును తాకుతోంది.
కేవలం నటిగానే కాకుండా ఒక బ్రాండ్ ఫేస్‌గా కృతి సనోన్ బాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. సినిమాలు- వాణిజ్య ప్రకటనలు రెండింటినీ సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటూ.. పరిశ్రమలో అత్యధిక సంపాదన కలిగిన కథానాయికలలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే ఇటీవలే `కాక్ టైల్ 2` విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తదుపరి నో ఎంట్రీ సీక్వెల్ లో నటిస్తోంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ కం మల్టీస్టారర్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఇది 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దర్శకుడు రాహుల్ ధోలాకియాతో కృతి సనోన్ ఒక ఉమెన్-సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ ని ప్రకటించారు. ఇది కూడా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.