బీచ్‌లో త‌డి పొడి అందాల‌తో క‌వ్విస్తున్న `హిట్- 2` బ్యూటీ

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కోమలీ ప్రసాద్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది.

Update: 2026-07-11 15:21 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కోమలీ ప్రసాద్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సముద్రతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో దిగిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.




 


ఈ ఫోటోలను షేర్ చేస్తూ కోమలీ ప్రసాద్ జోడించిన క్యాప్షన్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ``వర్షం పడుతున్నప్పుడు...ఆకాశ రంగుల కింద... సముద్రతీరంలో నన్ను కలవండి! అంటూ కోమ‌లి రాసిన రోమాంటిక్ అండ్ పొయెటిక్ లైన్స్ నెటిజనుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్యాప్షన్‌కు తగ్గట్టుగానే కోమ‌లి లుక్స్ కూడా ఎంతో ఎలిగెంట్‌గా ఉండటంతో ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.




 


ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం 14 గంటల వ్యవధిలోనే 22 వేలకు పైగా లైకులు, వందకు పైగా కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోమలి అందాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు టాలీవుడ్ క్వీన్, ఏంజిల్ అంటూ రకరకాల ఎమోజీలతో కామెంట్ల సెక్షన్‌ను నింపేశారు. ఒక అభిమాని అయితే కోమ‌లి క్లాసిక్ లుక్‌ను చూసి ఏకంగా ``మహానటి సావిత్రి ఈజ్ బ్యాక్`` అంటూ ప్రశంసించడం విశేషం.




 


మరికొందరు నెటిజన్లు కోమ‌లి రాసిన క్యాప్షన్‌కు స్పందిస్తూ.. ``ఏ బీచ్‌కి రావాలో చెబితే వచ్చి కలుస్తాం`` అంటూ క్రేజీగా రిప్లై ఇస్తున్నారు. అలాగే కోమ‌లి అందం- లుక్‌పై స్పందిస్తూ ``కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది`` అని కొందరు, ``ఇన్ని ఫోటోలు ఎందుకు, ఒక్కటి చాలు`` అని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలను షేర్ చేసారు. మొత్తానికి కోమలీ ప్రసాద్ లేటెస్ట్ బీచ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.




 


ట్యాలెంటెడ్ న‌టి కోమలీ ప్రసాద్ సినీ ప్రయాణాన్ని గమనిస్తే... అందం- అభినయ సామర్థ్యం రెండూ పుష్కలంగా ఉన్నా ఎందుక‌నో కోమ‌లి కెరీర్ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా 2022లో వచ్చిన `హిట్-2` వంటి సూపర్ హిట్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తర్వాత కూడా ఈ భామ‌కు వెండితెరపై ఆశించిన స్థాయిలో పెద్ద అవకాశాలు.. లీడ్ రోల్స్ రాలేదు. దీంతో గత నాలుగేళ్లుగా సినీ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. టాలెంట్ ఉండి కూడా పరిశ్రమలో సరైన గుర్తింపు లభించకపోవడానికి గల లోపం ఎక్కడుందనే చర్చ సాగున్నా...ఏమాత్రం పట్టువదలకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు అడుగులు వేసి గతేడాది వచ్చిన `టచ్ మీ నాట్` అనే పాపులర్ షోలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్నా... సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఫోటోషూట్లతో జోరు చూపిస్తూ... గ్లామర్ పాత్రలకైనా తాను సిద్ధమేనంటూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News