క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మార్పు? స్టార్ హీరో కోరికపై నెటిజనుల చర్చ!
కోలీవుడ్ లో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఒక అగ్ర హీరో మోస్ట్ బిజీగా దూసుకుపోతున్నారు.
కోలీవుడ్ లో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఒక అగ్ర హీరో మోస్ట్ బిజీగా దూసుకుపోతున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో అతడు నటిస్తున్న తాజా చిత్రం ముగించిన తర్వాత తమిళరసన్ పచ్చముత్తుతో ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్, మారి సెల్వరాజ్‌తో ఒక హిస్టారికల్ ఫిల్మ్ .. వెట్రిమారన్‌తో `తమిళ్ మురుగన్` వంటి భారీ లైన్-అప్ ఆయన చేతిలో ఉంది. అయితే `ఓం` చిత్రం పూర్తి కాగానే మొదట తమిళరసన్ పచ్చముత్తు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ ఎంపికపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'ఓం' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు తన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్ కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులను ఇప్పటికే వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సదరు స్టార్ హీరో సరసన నటించే కథానాయిక ఎంపికపై ట్రేడ్ వర్గాల్లో .. సోషల్ మీడియా వేదికలపై ఒక ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది.
నిజానికి దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు తన గత సూపర్ హిట్ చిత్రం `లబ్బర్ పందు`లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన సంజనను ఈ కొత్త సినిమాలో కూడా మెయిన్ లీడ్‌గా తీసుకోవాలని భావించారట. అయితే..తాజా సోషల్ మీడియా టాక్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లోకి సంజనకు బదులుగా `ప్రేమలు` ఫేమ్ ను తీసుకుంటే బాగుంటుందని సదరు స్టార్ హీరో మేకర్స్‌కు స్వయంగా సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
హీరోయిన్ మార్పుపై వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మిశ్రమ స్పందనలకు దారితీశాయి. అంతటి పెద్ద స్టార్ సరసన నటించే అవకాశం వచ్చి ఉంటే యంగ్ బ్యూటీ సంజన కెరీర్‌కు అది ఒక బిగ్ బూస్ట్ అవుతుందని.. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను రీప్లేస్ చేయడం వల్ల ఒక మంచి అవకాశాన్ని కోల్పోతుందంటూ కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజనకు అన్యాయం జరిగిందనే కోణంలో సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు హీరో అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ఒక సినిమాలో తన పక్కన నటించే హీరోయిన్ విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకునే పూర్తి హక్కు లీడ్ యాక్టర్‌కు ఉంటుందని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఈ యువకథానాయికకు ఉన్న విపరీతమైన క్రేజ్ - పాపులారిటీ ఈ కమర్షియల్ సినిమాకు బిజినెస్ పరంగా.. అలాగే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టే పరంగా భారీగా ప్లస్ అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ చిత్ర నిర్మాతలు గానీ, హీరో టీమ్ గానీ హీరోయిన్ ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే.