సినిమా వాళ్లు నో చెప్పిన పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం
సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఏ ప్రాతిపధికన వస్తున్నాయో ఏ ఒక్కరూ చెప్పలేక పోతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఏ ప్రాతిపధికన వస్తున్నాయో ఏ ఒక్కరూ చెప్పలేక పోతున్నారు. తల పండిన ఫిల్మ్ మేకర్స్ సైతం చాలా సార్లు తప్పులు చేస్తున్నారు. ప్రేక్షకులు దేన్ని స్వీకరిస్తున్నారు, దేన్ని తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఉదాహరణకు ఒక సినిమాలోని పాటను తీసుకుంటే దాని కోసం వంద ట్యూన్స్‌ను పరిశీలిస్తారు. సంగీత దర్శకుడు ఇచ్చిన వంద ట్యూన్స్‌లో దర్శక నిర్మాతలు ఒక ట్యూన్ ను ఎంపిక చేసి, ఇది కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది, సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అనుకుంటారు. కానీ ఆ పాట ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది, పైగా సినిమాలో ఆ పాటను చాలా పెద్ద మైనస్‌గా కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్ని పాటలు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల చేస్తే సంచలన విజయాన్ని సొంతం చేసుకుని, సినిమాపై ప్లస్ అవుతుంది. ఇలా చాలా పాటలను, కథలను ఫిల్మ్ మేకర్స్ తిరస్కరించడం, ఆ తర్వాత అవి హిట్ కావడం చూస్తూ ఉంటాం.
యూట్యూబ్‌లో కోయిలా పాట...
తాజాగా ఒక పాట యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. అలేఖ్య హారిక నటించిన కోయిలా సాంగ్ వైరల్ అయింది. తక్కువ సమయంలోనే దాదాపుగా 7.5 కోట్ల వ్యూస్‌ను రాబట్టుకోవడంతో పాటు, లక్షలాది మంది ఆ పాటకు రీల్స్ చేయడం జరిగింది. దాంతో కోయిలా పాట ఏ స్థాయిలో పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోయిలా పాటకు విజయ్ బల్లానిన్ సంగీతాన్ని అందించాడు. ఈ పాటను విజయ్ చాలా కాలం క్రితమే ట్యూన్ చేసి ఉంచాడట. పలువురు నిర్మాతలకు ఆ ట్యూన్‌ను వినిపించాడట. కానీ ఏ ఒక్కరూ కోయిలా ట్యూన్ ను మెచ్చలేదు. తాను సంగీతం అందించిన సినిమాల్లో ఏదో ఒక సినిమాలో ఈ పాటను పెట్టాలని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేశాడట. కానీ దర్శక నిర్మాతలు పడనివ్వలేదు. దాంతో చివరకు అలేఖ్య హారికతో ఈ పాటను ప్రైవేట్ గా షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.
అలేఖ్య హారిక కోయిల పాట వ్యూస్..
యూట్యూబ్‌లో కోయిలా పాట వచ్చిన వారం రోజుల్లోనే ఫలితం ఏంటో తేలిపోయింది. అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. పాటలో నటించిన వారు, సంగీతం అందించిన విజయ్, నిర్మించిన వారు ఏ ఒక్కరూ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు దాదాపుగా 8 కోట్ల వ్యూస్ ను రాబట్టిన ఈ పాట, ఇతర ప్లాట్ ఫ్లామ్స్ అన్నింట్లో కలిపి దాదాపుగా 20 కోట్ల ప్లే టైమ్స్ ను దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. సినిమా వారు తిరస్కరించిన ఈ పాటను ప్రేక్షకులు ఆదరించారు. ఎంతో మంది దర్శక నిర్మాతల తిరస్కరణకు గురి అయిన ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విడ్డూరంగా ఉంది. ఈ పాటను సరిగ్గా జడ్జ్ చేయడంలో ఫిల్మ్ మేకర్స్ విఫలం అయ్యారు. సినిమాలో ఈ పాట వచ్చి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ రీచ్ దక్కించుకునేది అనేది కొందరి అభిప్రాయం.
సంగీత దర్శకుడు విజయ్ బల్గానిన్ కి...
మొత్తానికి కోయిలా పాటతో అలేఖ్య హారిక, వినయ్ షణ్ముఖ్‌లకు మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా విజయ్ బల్గానిన్ కు సంగీత దర్శకుడిగా మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. బేబీ సినిమాకు సంగీతాన్ని అందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విజయ్ పలు అవార్డ్‌లను దక్కించుకున్నాడు. ఈ పాటతో మరింతగా పాపులారిటీని దక్కించుకున్న విజయ్ బల్గానిన్ ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందించేందుకు గాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ ఆల్బంలతో పాపులారిటీ అయిన సంగీత దర్శకులు పలువురు మెల్ల మెల్లగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ బల్గానిన్ తన కోయిలా పాట కారణంగా పెద్ద ఫిల్మ్ మేకర్స్ దృష్టి లో పడ్డాడు. దాంతో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలకు విజయ్ సంగీతాన్ని అందించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.