కయాదు లోహార్ విరామం వెనుక అసలు కారణం అదా?
థియేటర్ ఆర్ట్స్ -నటనలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం ద్వారా కెరీర్‌కు బలమైన పునాదిని వేసుకుంటోంది.
టాలెంటెడ్ నటి కయాదు లోహర్ సోషల్ మీడియాకు... షూటింగులకు కాస్త విరామం ఇవ్వడం తీవ్ర చర్చనీ యాంశమైంది. ఆమె ఎందుకు అకస్మాత్తుగా మాయమైపోయింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటనే దానిపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విరామం వెనుక ఉన్న అసలు కారణం తాజాగా బయటకొచ్చింది. అమ్మడు సినిమాలకు దూరం కావాలనో? లేక కెరీర్ పరంగా వెనకడుగు వేయాలనో గ్యాప్ తీసు కోలేదు. భవిష్యత్తును మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే బలమైన సంకల్పంతోనే కయాదు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
నటనలో మరింత నైపుణ్యం సాధించేందుకు కయాదు లోహర్ అమెరికాలోని న్యూయార్క్ యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకోబోతోందని తెలిసింది. యాక్టింగ్ కి సంబంధించి అడ్వాన్స్ కోర్సులు చేయాలనే ఉద్దేశంతోనే అమ్మడిలా గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా సెలవు ప్రకటించడానికి అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. నేటి తరం సినిమా పరిశ్రమలో కేవలం గ్లామర్ మాత్రమే సరిపోదు. వైవిధ్యమైన పాత్రలను పోషించగలిగే నటన చాతుర్యం కూడా ఎంతో ముఖ్యం. కయాదు లోహర్ పరిధిని మరింత పెంచుకోవాలని.. అంతర్జాతీయ స్థాయి నటనారీతులను నేర్చుకోవాలని భావించింది.
థియేటర్ ఆర్ట్స్ -నటనలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం ద్వారా కెరీర్‌కు బలమైన పునాదిని వేసుకుంటోంది. ఈ ప్రయాణానికి .. కఠినమైన శిక్షణకు మానసికంగా సిద్ధం కావడానికే ఇటీవలే సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్రపంచం నుండి వచ్చే డిస్టబెన్స్ ను దూరం చేసుకుని పూర్తిగా సమయాన్ని నటనపైనే కేంద్రీకరించాలని భావిస్తోంది. సోషల్ మీడియా డెటాక్స్ మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవసరమైన ఏకాగ్రతను అందిస్తుంది.
భవిష్యత్తులో వచ్చే ఛాలెంజింగ్ రోల్స్ కోసం తనను తాను సన్నద్ధం చేసుకోవాలనే ఆమె ఆలోచన ప్రశంసనీయం. న్యూయార్క్ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన తర్వాత కయాదు లోహర్ మరింత పరిణతి చెందిన నటిగా ప్రేక్షకులను అలరించడం ఖాయం. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా కయాదుకు వైవిధ్యమైన, వెయిటేజ్ ఉన్న పాత్రలు దక్కే అవకాశం ఉంది. తాత్కాలిక పాపులారిటీ ..అవకాశాల కోసం ప్రాకులాడకుండా లాంగ్ టర్మ్ కెరీర్ కోసం కయాదు లోహర్ తీసుకున్న నిర్ణయం నేటి తరం నటీనటులకు ఆదర్శం. నటన పట్ల ఆమెకున్న అంకితభావానికి.. క్రమశిక్షణకు ఈ నిర్ణయమే నిదర్శనం. ఈ విరామం ఆమె కెరీర్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశిద్దాం.