దాయ్రా.. కరీనా పృథ్వీరాజ్ కథేంటి?

కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటిస్తున్న ‘దాయ్రా’ నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఇద్దరినీ చూపిస్తూ, ఒక మొఖాన్ని పోలీస్ టేప్‌తో చూపించారు.

Update: 2026-08-25 16:08 GMT

కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటిస్తున్న ‘దాయ్రా’ నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఇద్దరినీ చూపిస్తూ, ఒక మొఖాన్ని పోలీస్ టేప్‌తో చూపించారు. ఈ పోస్టర్ సినిమా కథపై బజ్ క్రియేట్ చేసింది. వెనుక కనిపిస్తున్న మరో ముఖాన్ని కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఈ ఇద్దరి పాత్రల మధ్య అసలు కనెక్షన్ ఏంటన్నది ఇప్పటికైతే దాచిపెట్టారు.




దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఆగస్టు 31న వచ్చే ట్రైలర్‌తో కొంత వరకు రావచ్చు. మేకర్స్ కూడా కొత్త పోస్టర్‌తో పాటు ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు. పృథ్వీరాజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, కరీనా పాత్ర గురించి మాత్రం ఇంకా ఎక్కువ సమాచారం బయటకు రాలేదు. పోస్టర్ డిజైన్ చూస్తే ఒకే కేసులో ఇద్దరూ వేర్వేరు వైపుల నుంచి ప్రయాణించే కథగా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు.

‘దాయ్రా’లో మరో స్పెషల్ పాయింట్ కరీనా, పృథ్వీరాజ్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారి. హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న పృథ్వీరాజ్‌కు ఇది మరో కీలక ప్రాజెక్ట్. కరీనా కూడా ఈసారి క్రైమ్ డ్రామా జోన్‌లో మెఘనా గుల్జార్‌తో కలిసి పని చేస్తోంది. ఇద్దరి క్యారెక్టర్స్ కథను ఎలా ముందుకు తీసుకెళ్తాయన్నదే ట్రైలర్‌లో చూడాల్సిన విషయం.

మెఘనా గుల్జార్‌కు ఇలాంటి కథలు కొత్త కాదు. ‘తల్వార్’, ‘రాజీ’ సినిమాలతో ఆమె ఇప్పటికే క్రైమ్, ఇన్వెస్టిగేషన్, రియల్ లైఫ్ ఘటనలకు దగ్గరగా ఉండే కథలను డీల్ చేశారు. ఇప్పుడు ‘దాయ్రా’ కూడా నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథగా రూపొందుతోంది. యశ్ కేస్వానీ, సీమా అగర్వాల్‌తో కలిసి మెఘనా ఈ సినిమాకు కథ రాశారు.

జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మెఘనా గుల్జార్‌కు జంగ్లీ పిక్చర్స్‌తో మాత్రం ఇది మూడో ప్రాజెక్ట్. గతంలో ఇదే సంస్థతో ‘తల్వార్’, ‘రాజీ’ చేశారు. వినీత్ జైన్, జయంతిలాల్ గడా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, పెన్ మరుధర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుంది.

‘దాయ్రా’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు మూడు వారాల ముందే ట్రైలర్‌ను తీసుకొస్తున్నారు. పోస్టర్‌లో మాత్రం కథ కంటే పాత్రల మధ్య ఉన్న లింక్‌ను దాచిపెట్టడంపైనే ఫోకస్ పెట్టారు. ఆగస్టు 31న వచ్చే ట్రైలర్‌తో కరీనా ఏ వైపు, పృథ్వీరాజ్ వెతుకుతున్నది ఎవరి కోసం అన్న విషయంలో మొదటి క్లూ దొరకొచ్చు.

Tags:    

Similar News