రెండు ప్ర‌స‌వాల త‌ర్వాత కూడా ఫాంలోకి !

బేబో కరీనా కపూర్ ఖాన్ అనగానే గ్లామర్, జీరో సైజ్ గుర్తుకొస్తాయి. అమ్మ‌డు మంచి ఫిట్ నెస్ ప్రీక్ కావ‌డంతో? నోరు క‌ట్టేసుకునే నటిగా భావిస్తాం.

Update: 2026-05-12 13:30 GMT

బేబో కరీనా కపూర్ ఖాన్ అనగానే గ్లామర్, జీరో సైజ్ గుర్తుకొస్తాయి. అమ్మ‌డు మంచి ఫిట్ నెస్ ప్రీక్ కావ‌డంతో? నోరు క‌ట్టేసుకునే నటిగా భావిస్తాం. కానీ క‌రీనాకు రుచులు ఆర‌గించ‌డంలో ఉన్న మక్కువ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపో వాల్సిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విష‌యాలు వెల్ల‌డిం చింది. ముఖ్యంగా ఇష్టమైన దేశీ వంటకం తినకపోతే రాత్రి పూట నిద్ర కూడా పట్టదని అంటోంది. మ‌రి ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చే నటి ఇలా భోజన ప్రియురాలిగా మారడం వెనుక ఒక అందమైన జీవనశైలి దాగి ఉంది.

కరీనాకు ఎన్ని ఖరీదైన అంతర్జాతీయ వంటకాలు ముందున్నా? మన ఇంటి రుచుల్లో భాగంగా పప్పు-అన్నం అంటే ప్రాణ‌మంటోంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా? ప్రపంచంలో ఏ మూల ఉన్నా? రోజు చివర్లో తాను కోరుకునేది మాత్రం కమ్మని దేశీ భోజనమే . ఆ భోజ‌నం క‌డుపు నిండా తినకపోతే నిద్రపోలేను అంటోంది. ఆహారం అనేది కేవలం ఆకలిని తీర్చుకునేది మాత్రమే కాదు. అది మానసిక ప్రశాంతతను ఇచ్చే ఔషధం కూడా. డైటింగ్ పేరుతో కడుపు మార్చుకునే నేటి కాలంలో కరీనా మాటలు ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.

అయితే ఈ ఫుడ్ లవ్ తినడానికే పరిమితం కాలేదు. వంటగదిలో భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి గడపడం కూడా తనకు అత్యంత ఆనందాన్ని ఇస్తుందంటోంది. సైఫ్ అలీ ఖాన్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టమని ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా రకరకాల వంటకాలు చేసి పెడతారని మురిసిపోయింది. సైఫ్ వంట చేస్తుంటే? తాను పక్కన కూర్చుని ఆయనతో కబుర్లు చెప్పడం సంగీతం వినడం ఎంతో ఇష్టమైన వ్యాపకమని తెలిపింది. దీంతో ఈ జంటకు వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా మారింద‌ని చెప్పొచ్చు.

కరీనా కపూర్ ఫిట్‌నెస్ రహస్యం కూడా ఆమె ఆహారపు అలవాట్లలోనే ఉంది. తాను ఎప్పుడూ క్రాష్ డైటింగ్ నమ్న న‌ని, పూర్వీకులు తిన్న సంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని గట్టిగా నమ్ముతా నంటోంది. నెయ్యి, పప్పు, కూరగాయలు వంటి స్వచ్ఛమైన దేశీ ఆహారం తీసుకోవడం వల్లనే తాను రెండు ప్రసవాల తర్వాత కూడా ఇంత త్వరగా ఫామ్‌లోకి రాగలిగానని చెప్ప‌కొచ్చింది. సరైన పద్ధతిలో, సరైన సమయంలో తింటే ఏ ఆహారమైనా అమృతమేనని క‌రీనా అనుభవం ద్వారా చాటి చెబుతుంది. ఇంటి వంటలో ఉండే ప్రేమ, ఆత్మీయత బయట హోటల్ భోజనంలో దొరకదని అభిప్రాయపడింది. ముఖ్యంగా పండగలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం తమ ఇంటి సంప్రదాయమని అంటోంది. పిల్లలు తైమూర్, జెహ్‌లకు కూడా చిన్నప్పటి నుంచే ఇంటి వంటల విలువను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తామంటోంది. బ‌య‌ట తినే ఆహారం కంటే ఇంటి భోజ‌న‌మే ఆరోగ్య‌క‌ర‌మైందని చెబుతుంటామంది.

Tags:    

Similar News