వైట్ ఔట్‌ఫిట్‌లో కాజల్ మ్యాజిక్.. సింపుల్ లుక్‌కే సూపర్ క్లాస్ టచ్!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగానే కాకుండా, నటిగానూ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది.

Update: 2026-07-09 10:01 GMT

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగానే కాకుండా, నటిగానూ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యూటీ ఐవరీ వైట్ కలర్ స్మాక్డ్ గౌనులో దిగిన క్లాసిక్ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంతో సింపుల్‌గా, అంతే ఈ లుక్‌లో కాజల్ అగర్వాల్ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. తన స్మైల్‌తో మరింత ఆకట్టుకుంది. తల్లి అయిన తర్వాత సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో మరింత బాధ్యతగా ఉంటున్నానని ఆమె తాజాగా చెప్పింది.ఆ విశేషాలు చూద్దాం..




 



దేవకన్యలా మెరిసిన చందమామ:

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'ప్లీట్స్ బై అరుణి' డిజైన్ చేసిన యాంకెల్ లెంత్ వైట్ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ ఎంతో అందంగా కనిపించింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ అర్చన మెహతా ఈ లుక్‌ను చాలా రాయల్‌గా ప్లాన్ చేశారు. ఇక ఒక చేతిని తల వెనుకకు పెట్టుకుని, పెదవులపై చిన్న నవ్వుతో కాజల్ ఇచ్చిన పోజులు వింటేజ్ క్లాస్ లుక్‌ను గుర్తుచేస్తున్నాయి. మినిమల్ మేకప్, సింపుల్ ఇయర్ రింగ్స్ ఆమె అందాన్ని మరింత పెంచాయి.




 


'ది ఇండియా స్టోరీ'తో కిచెన్‌నే మార్చేసింది:

జూలై 24న రిలీజ్ కాబోతున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించింది. కల్తీ ఆహారం, పెస్టిసైడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్ తనను షాక్‌కు గురిచేసిందని కాజల్ చెప్పింది. ఇక ఈ సినిమా కథ విన్నాక, తన కొడుకు ఆరోగ్యం కోసం తన సొంత వంటగదిలోని వస్తువులనే మార్చేశానని, మంచి కంటెంట్ ఉన్నందుకే ఈ సినిమా చేశానని వెల్లడించింది.




 


'రామాయణ'లో మండోదరిగా స్పెషల్ రోల్:

రణ్‌బీర్ కపూర్, కన్నడ సూపర్ స్టార్ యశ్ కాంబినేషన్‌లో నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రంలో కాజల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె రావణుడి భార్య 'మండోదరి'గా కనిపించనుంది. ఇక పార్ట్-1 లో లంక పోర్షన్ తక్కువగా ఉండటం వల్ల తన రోల్ పరిమితంగానే ఉంటుందని, అయినప్పటికీ ఇంతటి గ్లోబల్ సినిమాలో భాగమవడం సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది.




 


థియేటర్లో కొడుకు చూసే మొదటి సినిమా:

కాజల్ తన కొడుకు నీల్ గురించి చెప్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. తన కొడుక్కి రామాయణం అంటే పిచ్చని, వాడికి రావణుడంటే ఇష్టమని, అందుకే తను మండోదరి పాత్ర చేస్తున్నట్లు చెప్పగానే వాడు ఎంతో ఖుషీ అయ్యాడని మురిసిపోయింది. ఇక థియేటర్లలో తన కొడుకు చూడబోయే మొదటి సినిమా ఇదేనని కాజల్ ఎమోషనల్ అయ్యింది.




 


మగధీర, డార్లింగ్, లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఏలిన కాజల్.. పెళ్లయ్యాక కూడా తన క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. కేవలం కమర్షియల్ హంగుల కోసమే కాకుండా, తన కొడుకు గర్వపడేలా కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని స్పష్టం చేసింది. ఇక ఈ సరికొత్త వైట్ లుక్ మరియు ఆమె ఆలోచనలపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News