పిక్‌టాక్ : మేడం వయసు 10 ఏళ్లు తగ్గినట్లుంది!
ఆ సమయంలో అప్పుడప్పుడు జ్యోతిక కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో నటిగా మాత్రం ఆమె వెండి తెరపై కనిపించలేదు అనే విషయం తెల్సిందే.
హీరోయిన్‌గా తమిళ్, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించి మెప్పించిన జ్యోతిక పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ సమయంలో అప్పుడప్పుడు జ్యోతిక కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో నటిగా మాత్రం ఆమె వెండి తెరపై కనిపించలేదు అనే విషయం తెల్సిందే. నటిగా జ్యోతిక చాలా భవిష్యత్తు ఉండగానే ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పింది అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఆమె నటించిన సినిమాలు టీవీలో చూసిన ప్రతిసారి ఆమె అభిమానులు జ్యోతిక మళ్లీ సినిమాలు చేయాలని కోరుకునే వారు. అభిమానులు కోరుకున్నట్లుగా జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తే అమ్మ, అక్క, అత్త పాత్రలతో సరి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ జ్యోతిక లీడ్ రోల్స్ దక్కించుకుంది, అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచింది.
జ్యోతిక న్యూ లుక్ చూసి అంతా షాక్...
జ్యోతిక సినిమాలు చేసే సమయంలో సన్నగా నాజూకుగా ఉండేది. పెళ్లి, పిల్లలు తర్వాత బరువు పెరిగింది. గృహిణిగా ఉన్న సమయంలో ఏ మహిళ అయినా వెయిట్ పెరగడం, ప్రెగ్నెన్సీ కారణంగా వెయిట్ పెరగడం అనేది కామన్‌గా జరిగే విషయమే. హీరోయిన్స్ సైతం గతంలో బరువు పెరిగి కనిపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. జ్యోతిక సైతం బరువు పెరిగి కనిపించింది. అయితే జ్యోతిక సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆమె వెయిట్ లాస్‌కి సమయం కేటాయించలేక పోయిందట. తాజాగా ఒక సినిమా కోసం జ్యోతిక చాలా బరువు తగ్గిందని చెన్నై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 47 ఏళ్ల వయసులో జ్యోతిక కేవలం 3 నెలల్లో ఏకంగా 9 కేజీల బరువు తగ్గింది. కేవలం డైట్ ఫాలో అవుతూ, రోజులో కొన్ని గంటల పాటు వర్కౌట్స్ చేయడం వల్ల ఇలా జరిగిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. జ్యోతిక బరువు తగ్గిన తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది.
ఐకానిక్ గోల్డ్ స్ట్రీమింగ్ అవార్డ్స్ 2026...
ఇటీవల జరిగిన ఐకానిక్ గోల్డ్ స్ట్రీమింగ్ అవార్డ్స్ 2026 లో జ్యోతిక రెడ్ కార్పెట్ పై కనిపించింది. ఆ సమయంలో జ్యోతిక సన్నగా, నాజూకుగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపుగా పదేళ్లు వయసు తగ్గిందా అన్నట్లుగా జ్యోతిక చాలా యంగ్ లుక్ లో కనిపించింది అంటూ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించేంత అందం, కమర్షియల్ పాత్రలు చేస్తూ కుర్రకారును ఆకట్టుకునే అందం జ్యోతిక అందం అంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ తెగ కామెంట్ చేస్తున్నారు. జ్యోతికను ఇంత అందంగా ఈ మధ్య కాలంలో చూడలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తే, ఈమె ధరించిన డ్రెస్‌తో పాటు, ఆమె ఫిజిక్, ఫిట్‌నెస్ కారణంగా పదేళ్లు వెనక్కి వెళ్లినట్లుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో జ్యోతిక గురించిన చర్చ జరుగుతోంది.
వరుస బాలీవుడ్ సినిమాలతో జ్యోతిక...
మెరిసే బర్గండీ కలర్ డ్రేప్డ్ ఔట్ ఫిట్ ధరించిన జ్యోతిక కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత అందంగా, ఫిట్‌గా ఉన్న కారణంగానే జ్యోతిక చేసిన, చేస్తున్న ప్రాజెక్ట్‌లకు మంచి క్రేజ్ ఉంటుందని, ముందు ముందు మరిన్ని సినిమాలు, సిరీస్‌లను జ్యోతిక చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ కు చెందిన హీరోయిన్స్‌లో అది కూడా అయిదు పదుల వయసుకు చేరువ అయ్యి ఇంత అందంగా కనిపించే వారు చాలా అరుదు అని, అంతే కాకుండా ఇంత అందంగా, ఇంత క్రేజ్‌ను దక్కించుకోవడం సైతం చాలా అరుదు అంటూ నెట్టింట తెగ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. జ్యోతిక గత కొన్నాళ్లుగా హిందీ సినిమాలు, సిరీస్‌లకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఆమెకు సౌత్‌లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగు, తమిళ సినిమాలు, సిరీస్‌లు సైతం చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.