ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు.. పోస్ట్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క 'బఘీరా' కన్నుమూసింది.

Update: 2026-08-19 07:12 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క 'బఘీరా' కన్నుమూసింది. ఈ బాధాకరమైన వార్తను తారక్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తనతో ఉన్న బఘీరాతో దిగిన కొన్ని మధురమైన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.



 


కుటుంబ సభ్యుడిగా మారిన బఘీరా :

బఘీరా తన జీవితంలోకి ఒక సాధారణ పెట్‌గా వచ్చినా, క్రమేణా కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయిందని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. తన దైనందిన జీవితంలో బఘీరా చూపించిన ప్రేమ, విశ్వాసం, అల్లరిని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. "నీవు లేని లోటు నా మనసులో ఎప్పటికీ పూడ్చలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది" అంటూ తారక్ రాసుకొచ్చిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నాయి.



 


భావోద్వేగంతో కూడిన వీడ్కోలు:

తనను ఎంచుకున్నందుకు, గడిచిన నాలుగేళ్లను ఎంతో అందంగా మార్చినందుకు బఘీరాకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. "చిన్నమ్మా.. స్వేచ్ఛగా పరిగెత్తుకెళ్లు. నిన్ను చాలా గాఢంగా ప్రేమించాం, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ కంటతడి పెట్టించే వీడ్కోలు పలికారు. బఘీరాతో కలిసి గడిపిన క్షణాలు, సోఫాలో రిలాక్స్ అయిన మూమెంట్స్, లాన్‌లో మరో పెట్‌తో ఉన్న ఫోటోలను ఆయన పంచుకున్నారు.



 


మొక్క నాటిన తారక్:

బఘీరా మరణం తర్వాత ఎన్టీఆర్ చేసిన ఒక పని అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బఘీరాను పూడ్చిపెట్టిన ప్రదేశంలో తారక్ స్వయంగా ఒక చిన్న మొక్కను నాటారు. తన జ్ఞాపకాలను ఎప్పటికీ పచ్చగా ఉంచుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కుడి చేతికి కట్టుతో ఉన్నప్పటికీ, బఘీరాను ఎంతో ప్రేమగా నిమురుతున్న ఫోటో ఆయనకు తన పెట్ డాగ్ పట్ల ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

కష్టకాలంలో దెబ్బ మీద దెబ్బ .. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు భుజం గాయం కాగా, ఇటీవలే కిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా సర్జరీ జరిగిందని తెలిసింది. ఇక ఒకవైపు చేతికి సర్జరీ అయి కోలుకుంటున్న తరుణంలో, తనకెంతో ఇష్టమైన పెట్ డాగ్ బఘీరా దూరమవ్వడం తారక్‌కు తీరని లోటుగా మారింది.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, కోలుకున్నాక అక్టోబర్ లేదా నవంబర్‌లో 'డ్రాగన్' షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఈ సినిమావచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కానుంది. ఇక మూగజీవి అయిన బఘీరా కోల్పోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News