లూగర్ లుక్ కోసం ఎన్టీఆర్ కష్టం.. అసలు నిజం బయటపెట్టిన ప్రశాంత్ నీళ్!
ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ తో తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగణానికి సంబంధించిన పాత్రలను కూడా రివీల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది . అటు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇటు జపాన్లో ఊహించని ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ , సలార్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎప్పుడో గత ఏడాది "NTR Neel" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడిన ప్రశాంత్ నీళ్.. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 4:30 నిమిషాల నిడివితో ఒక గ్లింప్స్ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ తో తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న భారీ తారాగణానికి సంబంధించిన పాత్రలను కూడా రివీల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ లూగర్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ పాత్రలో ఈ లుక్ లో కనిపించడానికి ఎన్టీఆర్ పడ్డ కష్టాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ తెలిపారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీళ్ మాట్లాడుతూ.. "ముఖ్యంగా ఈ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ అంగీకరించడం ఆయన కెరియర్ లోనే అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి.
ఇప్పటివరకు నేను రాసిన పాత్రలలో అత్యంత డార్క్, పవర్ఫుల్ క్యారెక్టర్ లూగర్. ఒక సాధారణ హీరో పాత్రలాగా కాకుండా ప్రేక్షకులు ఊహించని కోణంలో ఈ పాత్ర ఉంటుంది. ముఖ్యంగా ఆడియన్స్ ను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మాకైతే లేదు అందుకే గ్లింప్స్ లోనే ఆఫ్గాన్ ట్రేడ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా ఒక విలన్ అని మేము సూచించాం. ఈ పాత్రలో కనిపించడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు .కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఆయనను, ఆయన డెడికేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను.
ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల చాలా బలహీనంగా కనిపించడం చూసి ఇక నేనే ఆ వర్కౌట్స్ ఆపేయమని చెప్పాను. అయినా సరే ఆయన వినలేదు. ముఖ్యంగా నా విజన్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో ఆయనకు పని పట్ల ఉన్న అంకిత భావం చూసి నేనే ఆశ్చర్యపోయాను "అంటూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో డ్రామా భాగాన్ని ఇద్దరం కలిసి డెవలప్ చేసాము అంటూ కూడా ప్రశాంత్ నీళ్ తెలిపారు. మొత్తానికైతే ఈ సినిమా కోసం కేవలం నాలుగు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గడం పై ఎన్టీఆర్ పై సర్వత్రా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.