జానీ (X) శేఖర్: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య మాటల యుద్ధం!
తెలుగు చిత్రసీమలో స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గురించిన పరిచయం అవసరం లేదు. పరిశ్రమలో ఇద్దరూ అగ్ర స్థానంలో ఉన్న కొరియోగ్రాఫర్లు.
తెలుగు చిత్రసీమలో స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గురించిన పరిచయం అవసరం లేదు. పరిశ్రమలో ఇద్దరూ అగ్ర స్థానంలో ఉన్న కొరియోగ్రాఫర్లు. నైపుణ్యంలో ఒకరిని మించి ఒకరు రాణిస్తున్నారు. తెలుగు చిత్రసీమ సహా అన్ని సినీపరిశ్రమల్లో అగ్ర హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దక్షిణాదిన టాప్ కొరియోగ్రాఫర్స్. అగ్ర నటులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పనిచేసి.. సంవత్సరాలుగా అనేక చార్ట్‌బస్టర్ పాటలను అందించారు. వీరిద్దరి వృత్తిపరమైన పోటీ గురించి అభిమానులు రెగ్యులర్‌గా చర్చించుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా ఓ ఈవెంట్లో మాటల యుద్ధం జరిగినట్లు వార్తలు రావడంతో ఈ విషయం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. డాన్స్ మాస్టర్ల మధ్య జరిగిన ఈ కోల్డ్ వార్ గురించిన విశ్లేషణలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ వాగ్వాదానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు, పరిశ్రమ అంతర్గత రిపోర్టులు సోషల్ మీడియా వేదికలపై ప్రచారం కావడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు కొరియోగ్రాఫర్ల అభిమానులు సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను షేర్ చేయడం ప్రారంభించారు. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ.. తమ అభిమాన మాస్టరే గొప్ప అంటూ కామెంట్లు పెడుతుండటంతో ఈ సంఘటన ఆన్‌లైన్‌లో పెద్ద డిబేట్‌గా మారింది.
ఇది సాధారణ వాగ్వాదమేనా? వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విభేదమా? ఇలాంటివి తమ భవిష్యత్తు ప్రాజెక్టులను గానీ, వృత్తిపరమైన పనిని గానీ ప్రభావితం చేసేవరకూ వెళుతుందా? అంటూ చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎవరూ ఎలాంటి వివరాల్ని ఇవ్వలేదు. అయితే పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న ఇద్దరు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం టాలీవుడ్‌లో .. ఇతర సౌత్ ఇండస్ట్రీలలో కచ్చితంగా పెద్ద చర్చకు తావిచ్చింది. ఈ వివాదం త్వరగా సద్ధుమణగాలని అభిమానులు కోరుకుంటున్నారు. చాలా మంది ఎప్పటికి సద్ధుమణుగుతుందో చూడాలని కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఇద్దరు మాస్టర్లు 2026 లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. జానీ మాస్టర్ ఈ ఏడాది హిందీలో `ఓ రోమియో`, `ఆషిఖోన్ కీ కాలనీ`, `పాన్ కీ దుకాన్` చిత్రాలతో పాటు తమిళంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. రామ్ చరణ్ `పెద్ది` కోసం అతడు పని చేసారని కథనాలొచ్చాయి. అదే సమయంలో శేఖర్ మాస్టర్ కూడా 2026 లో తెలుగులో `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో పాటు తమిళంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `జన నాయగన్`కు అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ సమకూర్చారు. ఈ ఇద్దరూ తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.