జేడీ- శ్రీకాంత్ కన్వర్జేషన్.. విష్ణుప్రియ హోటల్ సీక్రెట్ ఏంటి?

తాజాగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆ ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Update: 2026-06-02 05:15 GMT

టాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్ కు ఎగ్జాంపుల్ చెప్పుకునే నటుల్లో జేడీ చక్రవర్తి, శ్రీకాంత్ కచ్చితంగా ఉంటారు. వారిద్దరూ ఒకే కాలంలో హీరోలుగా ఎదిగి అనేక చిత్రాల్లో కలిసి నటించడమే కాకుండా, పర్సనల్ గా కూడా మంచి రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆ ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

హైదరాబాద్‌ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ లో ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన రూపొందిస్తున్న 43వ చిత్రం వేదవ్యాస్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, అలీ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వేదికపై మాట్లాడుతున్న సమయంలో జేడీ చక్రవర్తి.. శ్రీకాంత్‌ తో తన పాత మెమోరీస్ ను ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. "పాత విషయాలు చెబుతున్నావ్" అంటూ శ్రీకాంత్ స్పందించగా, వెంటనే జేడీ "ఇప్పుడు మరో విషయం చెబుతా.. విష్ణుప్రియ హోటల్ గురించి" అంటూ నవ్వులు పూయించారు. "గుర్తులేదా?" అంటూ తిరిగి క్వశ్చన్ చేయడంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.

అంతటితో ఆగకుండా, "విష్ణుప్రియ హోటల్‌ లో శ్రీకాంత్ మూడో ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్‌ లోకి..." అంటూ ఏదో సీక్రెట్ బయటపెట్టబోతున్నట్లు జేడీ మాట్లాడారు. వెంటనే శ్రీకాంత్ మధ్యలో జోక్యం చేసుకుని, "నీవు ఏం చెప్పినా ఎవరూ నమ్మరు. ఏదో సరదాగా మాట్లాడుతున్నాడని అనుకుంటారు" అంటూ ఫన్ చేశారు. దీంతో అంతా ఫుల్ గా నవ్వుకున్నారు.

శ్రీకాంత్ కూడా తగ్గకుండా, "జేడీ గురించి నేను కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది" అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి స్పందించిన జేడీ, "అయితే ఇప్పుడు చెప్పు" అంటూ సవాల్ విసిరారు. ఆ ఫన్నీ కన్వర్జేషన్ మధ్యలో కమెడియన్ అలీ కూడా చేరి, "ప్రపంచంలో శ్రీకాంత్ లాంటి మంచోడు లేడు" అంటూ పొగిడారు. "జేడీ ఎప్పుడూ మాట్లాడుతూ పాయింట్ తీస్తుంటాడు" అంటూ మరోసారి నవ్వించారు. అయితే విష్ణుప్రియ హోటల్ గురించి జేడీ ప్రస్తావించిన విషయం ఏంటనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

అదే కార్యక్రమంలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, ఎస్వీ కృష్ణారెడ్డి గొప్ప దర్శకుడంటూ కొనియాడారు. ఆయన కథ చెప్పే విధానం ఎంతో ప్రత్యేకమని, ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. మరోవైపు శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించే అదృష్టం తనకే దక్కిందన్నారు. ప్రస్తుతం రూపొందుతున్న వేదవ్యాస్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అంతే కాదు ఎస్వీ కృష్ణారెడ్డి మరిన్ని చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకులను అలరించాలని అన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ సెలబ్రిటీల సందడితో గ్రాండ్ గా జరగ్గా.. జేడీ-శ్రీకాంత్ ఫన్నీ కన్వర్జేషన్ మాత్రం మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది.

Tags:    

Similar News