లోకేష్ 'బెంజ్'.. డౌట్స్ క్లియర్ చేయడమే టార్గెటా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు కనిపిస్తాయి.

Update: 2026-06-01 07:16 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు కనిపిస్తాయి. కేవలం కొన్ని సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్, యాక్షన్ స్టోరీలతో పాటు ఒకే యూనివర్స్‌ లో కథలను లింక్ చేసే ప్రయత్నంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలతో రూపొందిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

కానీ ఇటీవల ఎల్‌సీయూ డౌట్స్ పై అనేక డౌట్లు వినిపించాయి. ఇకపై యూనివర్స్‌ ను కంటిన్యూ చేసే ఆలోచన ఉందా? లేక వేర్వేరు కథలపైనే దృష్టి పెడతారా? అనే చర్చలు వినిపించాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రాజెక్టుగా బెంజ్ నిలవొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్న బెంజ్ చిత్రాన్ని బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్నారు. కథను మాత్రం లోకేష్ కనగరాజ్ అందిస్తున్నారు.

ఆ సినిమా ఎల్‌సీయూలో భాగంగానే రూపొందుతుండటం విశేషం. దీంతో లోకేష్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ప్రాజెక్టుపై ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ చిత్రంలో మాలీవుడ్ యాక్టర్ నివిన్ పౌలీ విలన్ రోల్ లో కనిపించనున్నారు. హీరోయిన్‌ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

లోకేష్ స్వయంగా ఆయనకు బెంజ్ యూనివర్స్‌ లో వెల్ కమ్ చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతే కాదు.. బెంజ్ నార్మల్ యాక్షన్ చిత్రంగా కాకుండా ఎల్‌సీయూకు మరింత హైప్ చేకూర్చే సినిమాగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గత చిత్రాలు ఖైదీ, లియోలకు సంబంధించిన కొన్ని స్టోరీ లింక్స్ ఇందులో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పటివరకు అభిమానుల్లో ఉన్న అనేక డౌట్స్ కు ఆ మూవీ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది.

అయితే లోకేష్ కనగరాజ్ సినీ జర్నీ కూడా ప్రత్యేకమే. కోయంబత్తూరు సమీప ప్రాంతానికి చెందిన ఆయన ఫస్ట్ బ్యాంక్ జాబ్ చేశారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తూ అవకాశాల కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా కమల్ హాసన్ సినిమాల ఎఫెక్ట్ తనపై ఎంతో ఉందని ఆయన పలుమార్లు చెప్పారు. అదే టేస్ట్ ఆయనను దర్శకుడిగా నిలబెట్టింది.

ఇక ఇప్పుడు బెంజ్ మూవీతో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్నారు. ఒకవైపు యాక్షన్ ఎంటర్టైనర్‌ గా వస్తున్న ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం, మరోవైపు తన యూనివర్స్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇవ్వడం.. ఈ రెండు టార్గెట్లతో వర్క్ చేస్తున్నారని చర్చ సాగుతోంది. దీంతో బెంజ్ కేవలం ఓ సినిమా మాత్రమే కాకుండా, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ పై క్లారిటీ ఇచ్చే ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తితో ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News