మొదటి స్పీచ్ లోనే జై బాబు అంటూ.. జయకృష్ణ మాస్ వైబ్
ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో రావడం, మంచి టీమ్ దొరకడం తనకు దక్కిన బెస్ట్ ఛాన్స్ అంటూ తన ఫీలింగ్స్ ను చాలా సింపుల్ గా షేర్ చేసుకున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరో జయకృష్ణ ఘట్టమనేని తన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్ లో మాట్లాడిన తీరు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ తనకు ఎంత స్పెషలో చెబుతూ స్టేజ్ మీద తన మనసులోని మాటలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా క్యాజువల్ గా పంచుకున్నాడు. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో రావడం, మంచి టీమ్ దొరకడం తనకు దక్కిన బెస్ట్ ఛాన్స్ అంటూ తన ఫీలింగ్స్ ను చాలా సింపుల్ గా షేర్ చేసుకున్నాడు.
సరిగ్గా ఏడాది క్రితం డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా కథను తనకు వినిపించాడని జయకృష్ణ గుర్తుచేసుకున్నాడు. ఆ స్టోరీ వినగానే అందులో ఉన్న ఎమోషనల్ డెప్త్ తనకు బాగా నచ్చేసిందట. తను చేస్తున్న క్యారెక్టర్ కు చాలా స్కోప్ ఉందని, నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశానని క్లియర్ గా చెప్పాడు.
తన వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, కేవలం దాని మీదే ఆధారపడి వచ్చిన ఛాన్స్ ను ఊరికే వాడేసుకోకూడదని జయకృష్ణ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా, తనను తాను ఛాలెంజ్ చేసుకుని మరీ ప్రాణం పెట్టి పనిచేశానన్నాడు. కేవలం తన ఓన్ యాక్టింగ్ టాలెంట్ తోనే ఆడియన్స్ ను మెప్పించాలనే ఒక గట్టి కసితోనే తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు.
తన కెరీర్ స్టార్టింగ్ లోనే అజయ్ భూపతి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ దొరకడం తన లక్ అని జయకృష్ణ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అజయ్ డైరెక్షన్ లో హీరోగా చేయడం వల్ల నటనలో చాలా కొత్త విషయాలు నేర్చుకోగలిగానని చెప్పాడు. తొలి అడుగులోనే ఇంత మంచి డైరెక్టర్ తో జర్నీ చేసే ఛాన్స్ రావడం సాధారణ విషయం కాదని చెబుతూ డైరెక్టర్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. షూటింగ్ టైమ్ లో డైరెక్టర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుట్ పుట్ ఇంత బాగా వచ్చిందన్నాడు.
ఇదే ఈవెంట్ లో తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా జయకృష్ణ చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడాడు. తాను చిన్నప్పటి నుంచి మహేష్ బాబుకు డైహార్డ్ ఫ్యాన్ అని స్టేజ్ మీద గర్వంగా చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని తాను ఇంతకుముందు కూడా ఓపెన్ గానే చెప్పానని గుర్తుచేస్తూ, బాబాయ్ మీద తనకున్న ఇష్టాన్ని మరోసారి ఆడియన్స్ ముందు బయటపెట్టాడు. మహేష్ లాంటి స్టార్ కు ఫ్యాన్ అవ్వడం తనకెప్పుడూ కిక్ ఇస్తుందంటూ తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను సరదాగా షేర్ చేసుకున్నాడు.
తన ఫస్ట్ మూవీ 'శ్రీనివాస మంగాపురం' ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేయడం తనకెంతో బూస్ట్ ఇచ్చిందన్నాడు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తూ బాబాయ్ తనను ఫుల్ గా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పాడు. మహేష్ ఇస్తున్న ఈ సపోర్ట్ చూసి మూవీ టీమ్ అంతా సూపర్ హ్యాపీగా ఉన్నారని చెబుతూ బాబాయ్ కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాడు.