హ‌బ్బీని ప‌రిచ‌యం చేసి షాకిచ్చిన ఫేమ‌స్ సింగ‌ర్

కళాకారుల మధ్య ఉండే బంధం ..ఒకరి వేడుకల్లో ఒకరు పాలుపంచుకోవడం ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. జాస్మిన్ సాండ్లాస్ పాటలతోనే కాదు.

Update: 2026-07-12 08:57 GMT

బాలీవుడ్ సింగ‌ర్ జాస్మిన్ సాండ్లాస్ విలక్షణమైన గొంతు తో ఎంత సంచ‌ల‌మ‌య్యారో? చెప్పాల్సిన ప‌నిలేదు.`ధురంధర్` జాస్మిన్ పాడిన‌ పాట మ్యూజిక్ ఛార్ట్‌లలో మరోసారి సంచలనం సృష్టించింది.

 

పాట‌తో పాటు...పాట‌లో ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసాయి. దీంతో జాస్మిన్ పేరు ఇండియా అంత‌టా మ‌రోసారి మారు మ్రోగిపోయింది. తాజాగా జాస్మిన్ ఓ గుడ్ న్యూస్ చెప్పేసారు. ఢిల్లీలో జరిగిన సంగీత కచేరీలో భాగంగా జాస్మిన్ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కచేరీ జరుగుతోన్న సమయంలోనే జాస్మిన్ కాబోయే భర్తను స్టేజీపైకి ఆహ్వానించారు.

ఈ అనూహ్యమైన సన్నివేశంతో స్టేడియం అంతా ఒక్క‌సారిగా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించడం.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడం అక్కడున్న‌ వారిని ముగ్ధులను చేసింది. ఇష్టమైన గాయని తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేస్తున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా హాజరు కావడం కచేరీకి మరింత కళను తెచ్చింది. వేడుకలో రణవీర్ సింగ్ పాల్గొనడం .. ఆమెకు తన విషెస్ తెలపడం గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

కళాకారుల మధ్య ఉండే బంధం ..ఒకరి వేడుకల్లో ఒకరు పాలుపంచుకోవడం ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. జాస్మిన్ సాండ్లాస్ పాటలతోనే కాదు. నిజాయితీ గల వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత వేడుకలు కేవలం వారి కుటుంబ సభ్యులకే కాకుండా వారిని ప్రేమించే లక్షలాది మంది అభిమానులకు కూడా ఉత్సవంలా మారుతున్నాయి. ఈ నిశ్చితార్థం ఆమె కెరీర్‌ను .. భవిష్యత్తు ప్రయాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో? చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే జాస్మిన్ సాండ్లాస్ నిశ్చితార్థాన్ని ప్రకటించినా? కాబోయే భర్తకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను .. అతని వృత్తికి సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అతని పేరు .. వృత్తి వివరాలను గోప్యంగానే ఉంచారు. సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఆ కారణంతోనే జాస్మిన్ తన భాగస్వామి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానులు కూడా ఆమె వ్యక్తిగత సంతోషాన్ని గౌరవించి ఎలాంటి వివ‌రాలు కూడా అడిగే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

సోష‌ల్ మీడియాలో కొంత మంది జాస్మిన్ అడిగినా? ఆమె నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న రాలేదు. ప్ర‌స్తుతం జాస్మిన్ సాండ్ంల‌స్ బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. అలాంటి ఫేమస్ సింగ‌ర్ తో తెలుగు సంగీత ద‌ర్శ‌కులు కూడా పాట‌లు పాడించాల‌ని ఈ సంద‌ర్భంగా నెటి జ‌నులు కోరుతున్నారు.

Tags:    

Similar News