ట్రెడిషనల్ శారీలో రాయల్ లుక్.. లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్ల మనసు దోచేసిన జాన్వీ కపూర్!

తన సోదరి అన్షులా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం జాన్వీ ధరించిన లావెండర్ కలర్ బనారసి సిల్క్ శారీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Update: 2026-07-08 17:19 GMT

బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో అప్సరసలా మెరిసిపోయింది. తన సోదరి అన్షులా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం జాన్వీ ధరించిన లావెండర్ కలర్ బనారసి సిల్క్ శారీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ భారతీయ శైలికి మోడ్రన్ టచ్ ఇస్తూ జాన్వీ చేసిన ఈ ఫ్యాషన్ ప్రయోగం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాయల్ లుక్‌లో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోల ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం..



 


మనీష్ మల్హోత్రా డిజైన్‌లో మెరిసిన రాయల్ బ్యూటీ:

సినిమా ప్రమోషన్లు అయినా, ఫ్యామిలీ ఫంక్షన్లు అయినా జాన్వీ కపూర్ చీర కట్టుకుంటే ఆ అందమే వేరు. తాజాగా తన సోదరి అన్షులా కపూర్, రోహన్ థక్కర్‌ల పెళ్లి రిసెప్షన్ కోసం జాన్వీ ఒక అద్భుతమైన చీరను ఎంచుకుంది. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన లావెండర్ అండ్ గోల్డ్ కలర్ బనారసి సిల్క్ హ్యాండ్‌వోవెన్ బ్రొకేడ్ శారీలో జాన్వీ ఒక యువరాణిలా కనిపించింది. చీరపై ఉన్న గోల్డ్ ఫ్లోరల్ డిజైన్ ఈ అవుట్‌ఫిట్‌కు మరింత గ్రాండ్ లుక్‌ను తెచ్చింది.



 


మోడ్రన్ బ్లౌజ్‌తో అదిరిపోయే కాంబినేషన్:

క్లాసిక్ సిల్క్ చీర కట్టుకున్నప్పటికీ, దానికి జాన్వీ జోడించిన మోడ్రన్ స్టైలింగ్ అందరినీ పడగొట్టేసింది. ఈ సాంప్రదాయ చీరకు మ్యాచింగ్‌గా ఆమె ఒక స్ట్రాప్‌లెస్, బ్యాక్‌లెస్ మోడ్రన్ బ్లౌజ్‌ను ధరించింది. ఇక చీరలోని రాయల్ లుక్ ఏమాత్రం తగ్గకుండా, కావలసినంత గ్లామర్ అండ్ డ్రామాను ఈ కాంటెంపరరీ బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా యాడ్ చేసింది. ఈ స్టైలింగ్ చూసిన ఫ్యాన్స్ జాన్వీ ఫ్యాషన్ సెన్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.



 


భారీ జ్యువెలరీ.. కళ్ళు చెదిరే అలంకరణ:

ఈ లుక్ కోసం జాన్వీ ఆభరణాల విషయంలో అస్సలు తగ్గలేదు. మెడకు సరిపోయే భారీ చోకర్ నెక్లెస్, పెద్ద జూకాలు, చేతులకు మ్యాచింగ్ గాజులు, ఉంగరాలతో పాటు సాంప్రదాయ నడుము వడ్రనం ధరించి మురిపించింది. దీనికి తోడు చేతిలో ఒక గోల్డ్ క్లచ్ పట్టుకుని స్టైలిష్‌గా పోజులిచ్చింది. సాఫ్ట్ గ్లామ్ మేకప్, గ్లోసీ లిప్స్, నుదుట చిన్న బిందీ మరియు మధ్య పాపిడితో వేసుకున్న క్లాసిక్ హెయిర్ బన్‌తో జాన్వీ లుక్ కంప్లీట్ అయ్యింది.



 


ఇక ఆమె ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసారు. "మనీష్ మల్హోత్రాను తన గాడ్‌ఫాదర్, మెంటార్, గైడింగ్ లైట్ మరియు నమ్మకమైన స్నేహితుడిగా అభివర్ణించిన ఆమె, చిన్నప్పటి నుండి ఆయన సృజనాత్మకతను, అభిరుచిని ఎంతగానో ఆరాధించానని చెప్పుకొచ్చారు. పారిస్‌లో ఆయన ప్రదర్శించబోయే లేటెస్ట్ కలెక్షన్ కేవలం అద్భుతమైన హస్తకళ మాత్రమే కాదని, ఆయనకు అత్యంత ఇష్టమైన తన తల్లికి అంకితం ఇస్తున్న వ్యక్తిగత నివాళి అని పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున తన తల్లి వైపు వారసత్వానికి ప్రతీక అయిన కాంచీవరం చీరను సరికొత్తగా రీక్రియేట్ చేసిన మనీష్ మల్హోత్రా డిజైనర్ అవుట్‌ఫిట్‌ను ధరించడం తనకు ఎంతో అర్థవంతంగా మరియు సంతోషంగా ఉందని, పారిస్‌లో ఆయన సృష్టించే మ్యాజిక్‌ను ఇంటి నుండే చూస్తూ సగర్వంగా సపోర్ట్ చేస్తున్నానని" జాన్వీ కపూర్ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె అయిన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అంతా సందడి చేసినప్పటికీ, అందరి కళ్ళు మాత్రం జాన్వీ కపూర్‌పైనే నిలిచాయి. గ్లామర్, ట్రెడిషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పిక్స్ నెటిజన్లకు ఫుల్ విజువల్ ట్రీట్ ఇస్తున్నాయి. మరి రాబోయే భారీ చిత్రాలతో ఈ బ్యూటీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News