గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. నెటిజన్లకు నిద్రపట్టనీయని ఫోటోషూట్!

జాక్వెలిన్ ఈ ఈవెంట్ కోసం సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ సాధారణమైనది కాదు. ఫేమస్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘కరోలిన్స్ కోచర్’ డిజైన్ చేసిన కస్టమ్ బ్లాక్ సిల్క్ మౌస్లిన్ మినీ డ్రెస్ ఇది.

Update: 2026-05-19 11:43 GMT

విశిష్టమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన గ్లామర్ డోస్‌తో ఇంటర్నేషనల్ లెవెల్‌లో సెగలు పుట్టిస్తోంది. అక్కడ జరిగిన చోపార్డ్ మిరాకిల్ గాలా ఈవెంట్‌లో ఆమె వేసుకున్న బ్లాక్ మినీ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ద పెద్ద గౌన్లు వేసుకుంటేనే కేన్స్‌లో హైలైట్ అవుతారనే రూల్‌ను బ్రేక్ చేస్తూ, ఒక చిన్న బ్లాక్ డ్రెస్‌తో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోందీ ముద్దుగుమ్మ. ఆ హాట్ ఫోటోషూట్ విశేషాలు చూద్దాం..

 

చోపార్డ్ ఈవెంట్‌లో ఏకైక ఇండియన్ స్టార్:

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన అత్యంత లగ్జరీ అండ్ క్రేజీ ఈవెంట్ 'చోపార్డ్ మిరాకిల్ గాలా'. ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌కు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక సెలబ్రిటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రమే కావడం విశేషం. అందుకే ఈ వేడుకలో ఆమె లుక్ మరింత స్పెషల్‌గా నిలిచింది. ఇక రెడ్ కార్పెట్ మీదే కాదు.. హోటల్ కారిడార్‌లో ఆమె నడుస్తూ ఇచ్చిన పోజులు, అద్దం ముందు తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

 

‘కరోలిన్స్ కోచర్’ మ్యాజిక్:

జాక్వెలిన్ ఈ ఈవెంట్ కోసం సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ సాధారణమైనది కాదు. ఫేమస్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘కరోలిన్స్ కోచర్’ డిజైన్ చేసిన కస్టమ్ బ్లాక్ సిల్క్ మౌస్లిన్ మినీ డ్రెస్ ఇది. ఇక స్ట్రాప్‌లెస్ మోడల్‌లో ఉన్న ఈ డ్రెస్‌కు స్విస్ ఎంబ్రాయిడరీ, సీక్విన్స్, ముత్యాల లాంటి పూసల వర్క్ మరియు మెరిసే క్రిస్టల్స్ అద్ది హైలైట్ చేశారు. దీంతో ఆమె నడుస్తుంటే చిన్న చిన్న మెరుపులతో డ్రెస్ మొత్తం వెలిగిపోయింది.

 

సింపుల్ నగలు.. హుందాతనం:

ఈ లుక్‌లో హైలైట్ ఏంటంటే.. జాక్వెలిన్ హెవీగా మేకప్ వేసుకోలేదు, నగలు కూడా ఎక్కువగా పెట్టలేదు. కేవలం ఒక డైమండ్ గొలుసు, పెద్ద గుండ్రని చెవి రింగులు, చేతికి వెడల్పాటి కడియంతో లుక్‌ను సింపుల్‌గా డ్రెస్ చేసింది. ఇక జుట్టును ఒక పక్కగా వదిలేసి, బ్లాక్ కలర్ హై హీల్స్ చెప్పులతో ఆమె నడిచిన నడక ఈ ఫోటోషూట్‌కే కొత్త అందాన్ని తెచ్చింది. పెద్దగా కష్టపడకుండా చాలా సహజంగా గ్లామర్‌ను ఎలా పీక్స్‌కు తీసుకెళ్లవచ్చో జాక్వెలిన్ చూపించింది.

 

సినిమాల్లోనూ ఫుల్ బిజీ:

జాక్వెలిన్ కేవలం ఇలాంటి ఫ్యాషన్ ఈవెంట్లకే పరిమితం కాలేదు. ఆమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. గత రెండేళ్లలో సర్కస్, సెల్ఫీ, ఫతే, మరియు అమెరికన్ మూవీ 'కిల్ ఎమ్ ఆల్ 2' లో నటించిన ఈమె.. గత ఏడాది వచ్చిన రైడ్ 2, హౌస్‌ఫుల్ 5 మూవీస్ హిట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది 2026 లో ఆమె నటించిన ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. అంటే అటు స్క్రీన్ మీద, ఇటు గ్లామర్ ప్రపంచంలో ఆమె అస్సలు ఖాళీగా లేదన్నమాట.

ఇక తక్కువ ముస్తాబుతో ఎక్కువ ఇంపాక్ట్ చూపించవచ్చని జాక్వెలిన్ మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే లగ్జరీ బ్రాండ్ చోపార్డ్ సంస్థ కూడా తమ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. కేన్స్ వేదికగా జాక్వెలిన్ వదిలిన ఈ గ్లామర్ బాంబ్ నెటిజన్ల గుండెల్లో మంటలు పుట్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News