పౌరాణిక పాత్రల మధ్య బాక్సాఫీస్ పోరు!

ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ యూనివర్స్లుగా రూపాంతరం చెందుతున్నాయి.;

Update: 2026-04-19 11:30 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో మ‌ళ్లీ పౌరాణిక చిత్రాల ట్రెండ్ మొద‌లైంది. ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ యూనివర్స్లుగా రూపాంతరం చెందుతున్నాయి. `రామాయణ`, `మ‌హాభార‌తం` నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించ డానికి సిద్ధమ వుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అగ్ర కథానాయకులు పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తుండటంతో వెండితెరపై మహా సంగ్రామం జరగబోతోందని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వ‌స్తోన్న‌ `జై హనుమాన్` చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. `హనుమాన్` వంటి భారీ విజయం తర్వాత వ‌స్తోన్న‌ సీక్వెల్‌లో పౌరాణిక పాత్రల చిత్రణపై ఆసక్తి నెలకొంది. ఇందులో రావణుడి పాత్ర కోసం రానా దగ్గుపాటిని ఎంపిక చేసినట్లు వ‌స్తోన్న‌ వార్తలు సర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. రానా గంభీరమైన కంఠస్వరం, భారీ కాయంతో రావణ బ్రహ్మ పాత్రకు సరైన న్యాయం చేయగలరని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో హ‌న‌మంతుడి పాత్ర‌ను రిష‌బ్ శెట్టి పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా `రామాయణ` చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, లంకేశ్వరుడి (రావణుడు) పాత్రలో కన్నడ స్టార్ హీరో యశ్ పోషిస్తున్నాడు. రణబీర్ నటనతో రాముడిలోని శాంతి..వీర‌త్వం ఎలా హైలైట్ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. రాకీ భాయ్ ఇమేజ్ ఉన్న యశ్ రావణుడిగా ఏ స్థాయిలో గర్జిస్తాడో? చూడాలని ప్రేక్షకులు అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో మిగ‌తా పాత్ర‌లు కూడా అంతే హైలైట్ అవుతున్నాయి.

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం `వార‌ణాసి` పై కూడా పౌరాణిక ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ పాత్ర అర‌గంట పాటు రాముడిని పోలి ఉంటుది. అడవుల నేపథ్యంలో సాగే సాహస యాత్ర కథ కావ‌డంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రాజమౌళి తీర్చిదిద్దే రామ రూపాన్ని చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఇలా ఒకే ఇతివృత్తం , ఒకే రకమైన పాత్రల చుట్టూ ఇంతమంది స్టార్ హీరోలు పోటీ పడుతుండటం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర‌ పరిస్థితులకు దారితీస్తుంది. ప్రతి హీరో తనదైన శైలిలో పౌరాణిక పాత్రకు కొత్త భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏ హీరో ఆ పాత్రలో బాగా ఒదిగిపోతాడు? అనే చర్చ కూడా నెట్టింట జోరుగా సాగుతోంది. మ‌రి ఈ రెండు, మూడేళ్ల కాలంలో రిలీజ్ అయ్యే ఈ చిత్రాల్లో ఎవ‌రు టాప్ చైర్ లో ఉంటారో చూడాలి.

Tags:    

Similar News