చిరుతో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిన బాలయ్య బ్యూటీ.. కారణం?
అప్పట్లో హీరోయిన్గా నటించింది కానీ ఆ రెండు సినిమాలు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ప్రతీ విషయాన్ని నేర్చుకుంటూ.. హీరోగా మారి.. సుప్రీం హీరోగా పేరు దక్కించుకొని..నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు చిరంజీవి. ఒకరు కాదు ఇద్దరు కాదు నేడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చినవారే. అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయనతో చిన్న అవకాశం వస్తే చాలు తెరపై కనిపించాలని సంబరపడిపోయే వాళ్ళు కోకొల్లలు. అయితే అలాంటి ఒక బ్యూటీ చిరంజీవి పక్కన నటించే అవకాశం వస్తే.. సున్నితంగా తప్పుకుందట . ఈ విషయం తెలిసి ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ ముచ్చట్లు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఆమె ఎవరో కాదు బాలయ్య బ్యూటీ హనీ రోజ్. అందం, అభినయంతో మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్ తో నటిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఈమె.. 2012లో వచ్చిన త్రివేండ్రం లాడ్జ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా 14 ఏళ్ల ప్రాయంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. తెరపై తన నటనను కనబరిచిన ఈమె.. తమిళ్, మలయాళం చిత్రాలలో ఆకట్టుకొని.. 2008లో ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రంగా వచ్చిన ఆలయం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక తర్వాత 2014లో వచ్చిన ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఇండస్ట్రీకి దూరమైంది.
అప్పట్లో హీరోయిన్గా నటించింది కానీ ఆ రెండు సినిమాలు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. కానీ 2023లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ డ్రామా చిత్రం వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా.. ఒక పాత్రకి బాలయ్య సరసన నటించి ఆకట్టుకుంది . ఇందులో అందం అభినయంతో, కట్టు బొట్టుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఊహించని పాపులారిటీ అందుకుంది.
అలాంటి ఈమెకు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. పైగా అవకాశం లభించగానే ఎంతో ఎగ్జైట్ అయిపోయి అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే అంతలోనే చేయలేనని అడ్వాన్స్ కూడా తిప్పి పంపిందట హనీ రోజ్. సాధారణంగా చిరంజీవి సినిమాలో అవకాశం లభించడమే గొప్ప అయితే అలాంటిది ఈమెకు అవకాశం లభించి.. అడ్వాన్స్ కూడా ఇచ్చినా సరే సినిమా చేయలేనని తిప్పి పంపడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఇది నిజమేనా అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య బ్యూటీగా పాపులారిటీ దక్కించుకున్న హనీ రోజ్ చిరంజీవి మూవీని రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ మరి కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇది తెలిసిన అభిమానులు మాత్రం హనీ రోజ్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.