పూజా- మృణాల్ మ‌ధ్య ఇరుక్కుపోయిన వ‌రుణ్ ధావ‌న్

బాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ కామెడీ, కన్ఫ్యూజన్, రొమాన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Update: 2026-05-23 09:44 GMT

బాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ కామెడీ, కన్ఫ్యూజన్, రొమాన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి బజ్‌ను సృష్టిస్తోంది.

ఈ సినిమాఈలో వ‌రుణ్ ధావ‌న్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, జూన్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సాంగ్స్, పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందనే విషయం స్పష్టమవుతోంది.

కథలో వరుణ్ ధావన్ పాత్ర ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకుని వ్య‌క్తిగా, దాని ద్వారా ఎదురయ్యే సిట్యుయేష‌న్స్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఒకవైపు పాత ప్రేమ, మరోవైపు కొత్త రిలేషన్‌షిప్ మధ్య అతని పాత్ర పడే ఇబ్బందుల్ని చాలా హాస్యభరితంగా చూపించారు. ముఖ్యంగా పూజా హెగ్డ‌, మృణాల్ ఠాకూర్ పాత్రలు వరుణ్‌కు ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పే సీన్ ట్రైలర్‌లో పెద్ద కామెడీ మోమెంట్‌గా నిలిచింది. పెళ్లి భయాలు, ప్రేమలో వచ్చే అపార్థాలు, ఫ్యామిలీ కన్ఫ్యూజన్ వీట‌న్నింటినీ మిక్స్ చేసి డైరెక్ట‌ర్ డేవిడ్ ధావన్ తన పాత స్టైల్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. కలర్‌ఫుల్ విజువల్స్, ఫాస్ట్ పేస్డ్ కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ మూమెంట్స్ ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. 90స్ సూపర్ హిట్ సాంగ్ చునారీ చునారీని రీమిక్స్ రూపంలో మళ్లీ వినిపించడం నాస్టాల్జిక్ ఫీల్‌ను తెచ్చింది. అలాగే ఇప్పటికే విడుదలైన వావ్, తేరా హో జాన్, వ్యాహ్ క‌ర్వాదో జీ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించాయి. ముఖ్యంగా వెడ్డింగ్ థీమ్‌తో వచ్చిన వ్యాహ్ క‌ర్వాదో జీ యూత్ లో డాన్స్ ఫేవరెట్‌గా మారింది. ఈ సినిమాలో చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ ర‌య్, అలీ అస్గ‌ర్ కీలక పాత్రల్లో కనిపించనుండటంతో కామెడీకి మరింత బలం చేకూరనుంది. ఇదే సమయంలో డేవిడ్ ధావన్- వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో ఇది నాలుగు సినిమా కావడం కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మారింది. నిర్మాత ర‌మేష్ తార‌ని నిర్మిస్తున్న ఈ సినిమా కామెడీ, మ్యూజిక్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పక్కా సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అభిప్రాయం ట్రైలర్ తర్వాత బలంగా వినిపిస్తోంది.


Full View


Tags:    

Similar News