నోల‌న్ ముంబై ఈవెంట్లో గౌత‌మ్ కృష్ణ‌తో ఆ గ్యాంగ్ ఎవ‌రు?

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' విడుదల కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Update: 2026-07-15 18:49 GMT

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' విడుదల కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం సామాన్య ప్రేక్షకులే కాకుండా.. మన దేశానికి చెందిన సినీ ప్రముఖులు సైతం ఈ విజువల్ వండర్‌ను వెండితెరపై వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇటీవల ముంబైలో జ‌రిగిన గ్రాండ్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో క్రిస్టోఫర్ నోలాన్ ప్ర‌త్యేకంగా సంద‌డి చేయ‌గా, ఇదే వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు న‌ట‌వార‌సుడు గౌత‌మ్ కృష్ణ (ఘట్టమనేని) కూడా ప్ర‌త్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు గ్లోబల్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటులు టామ్ హాలండ్, మాట్ డామన్ హాజరయ్యారు. అయితే ఇంతటి అంతర్జాతీయ తారాగణం మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వేడుకలో పాల్గొన్న గౌతమ్ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. అయితే ఈ ఈవెంట్ అంతటా గౌత‌మ్ తో పాటు సంద‌డి చేసిన ఆ బోయ్స్ గ్యాంగ్ ఎవ‌రు? అన్న ఆసక్తికరమైన చ‌ర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో జోరుగా సాగుతోంది.

గౌత‌మ్ తో పాటు అంతటి పెద్ద గ్లోబల్ ఈవెంట్ లో కనిపించిన ఆ కుర్రాళ్లు.. ప్రస్తుతం లండ‌న్ లో అతనితో పాటు హయ్యర్ స్ట‌డీస్ కొన‌సాగిస్తున్న స్నేహితులు అయి ఉంటారా? గౌత‌మ్ క్లాస్ మేట్స్ అనుకోవ‌చ్చా? అన్న చ‌ర్చలు ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తున్నాయి. మహేష్ బాబు వారసుడు కావడం వల్ల సహజంగానే అతడి స్నేహితుల గుంపుపై కూడా అందరి కళ్ళు పడ్డాయి. ఈ ప్రీమియర్ వేదికపై వారంతా కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

మరోవైపు న‌మ్ర‌త శిరోద్కర్ కుమారుడిగా అమ్మ‌మ్మ ఊరైన ముంబైలో గౌత‌మ్ కి పెద్ద బ‌ల‌గ‌మే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌న్న ముచ్చ‌ట కూడా గట్టిగా సాగుతోంది. ముంబై సర్కిల్స్‌లో కూడా గౌతమ్ కి మంచి నెట్‌వర్క్ ఉందనడానికి ఈ ఈవెంట్ లో అతని ఫ్రెండ్స్ హంగామానే ఒక ఉదాహరణ. అయితే ఎంతమంది స్నేహితుల గుంపులో ఉన్నా గౌత‌మ్ మాత్రం తన యూనిక్ లుక్ తో ప్రత్యేకంగా మెరిసిపోతున్నాడు. గౌత‌మ్ టాప్ టు బాట‌మ్ బ్లాక్ క్లాసీ సూట్ లుక్ లో ఈవెంట్ కే ప్రధాన హైలైట్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు.

భవిష్యత్తులో వెండితెర అరంగేట్రం కోసం సిద్ధమవుతున్న గౌతమ్.. ఇలాంటి ఒక అంతర్జాతీయ గ్లోబల్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఘట్టమనేని మూడో తరం వారసుడిని త్వరలోనే తెలుగు తెరపై హీరోగా చూడాలని.. తండ్రి మహేష్ బాబు లాగే ఇండస్ట్రీని ఏలాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News