రిలేషన్‌షిప్స్‌పై కొత్త ఫిలాసఫీ – ఫరియా వ్యాఖ్యలు హాట్ టాపిక్

టాలీవుడ్ లో చిట్టిగా కుర్రాళ్ల మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా, కేవలం అందంతోనే కాదు తన ఆలోచనలతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.;

Update: 2026-05-10 19:30 GMT

టాలీవుడ్ లో చిట్టిగా కుర్రాళ్ల మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా, కేవలం అందంతోనే కాదు తన ఆలోచనలతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా ప్రేమ, పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్ విషయంలో ఫరియా చెప్పిన కొత్త ఫిలాసఫీ విని చిట్టి మామూలు పిల్ల కాదు.. చాలా డెప్త్ ఉంది, అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చెప్పిన ఆ ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రేమ వేరు.. పెళ్లి వేరు:

చాలామంది ప్రేమ, పెళ్లి రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఫరియా దృష్టిలో ఇవి రెండూ పూర్తిగా వేరు వేరు అంశాలట. "ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారు అన్న ఆలోచనే మనకి ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కానీ పెళ్లి అనేది ఒక బాధ్యత. ఒక మనిషి తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి, కొత్తగా పరిచయం చేసుకోవడానికి పెళ్లి ఉపయోగపడుతుంది" అని ఫరియా తన అభిప్రాయాన్ని పంచుకుంది.

పెళ్లి అర్థం మారిపోతుందా?:

ప్రస్తుత జనరేషన్ పెళ్లి పట్ల ఆసక్తి కోల్పోతున్న విషయాన్ని ఫరియా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. "ఈ కాలం యువత ఆలోచనలు మారుతున్నాయి. భవిష్యత్తులో వివాహం అనే పదానికి అర్థమే మారిపోవచ్చు" అని ఆమె అనడం హాట్ టాపిక్ అయ్యింది. రిలేషన్‌షిప్స్‌ను పెళ్లి అనే ఓక చక్రం లో కాకుండా, సెల్ఫ్ ట్రాన్స్‌ఫార్మేషన్ లాగా చూడటం నిజంగా ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ.

మల్టీ టాలెంటెడ్ మాయమ్మ:

ఇక కేవలం నటనకే పరిమితం కాకుండా ఫరియా తనలోని ఇతర కోణాలను కూడా బయటపెడుతోంది. రీసెంట్ గా ‘జెట్లీ’ సినిమాకు డబ్బింగ్ చెప్పింది, అలాగే ‘మత్తు వదలరా-2’లో ఒక పాటకు లిరిక్స్ రాసి కొరియోగ్రఫీ కూడా చేసింది. అంతేకాదు, డైరెక్షన్ మీద ఉన్న ఇష్టంతో వచ్చే ఏడాది నుండే మెగా ఫోన్ పట్టేందుకు ట్రయల్స్ మొదలుపెడతానని హింట్ ఇచ్చింది. ఇక ఫరియాలోని ఈ ఆల్ రౌండర్ టాలెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

‘భగవంతుడు’తో రా ఫ్యాక్షన్ డ్రామా:

ఇప్పటివరకు మోడ్రన్ పాత్రలు చేసిన ఫరియా, మొదటిసారి ఒక సీరియస్ రోల్ లో మనల్ని అలరించబోతోంది. తిరువీర్ హీరోగా వస్తున్న 'భగవంతుడు' చిత్రంలో ఆమె ఒక గ్రామీణ యువతిగా కనిపించనుంది. 1990ల నాటి పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో తన పాత్ర చాలా సవాలుగా ఉంటుందని ఫరియా చెప్పుకొచ్చింది. ఇక ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ కానున్న ఈ పాన్-ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

మొత్తానికి ఫరియా అబ్దుల్లా అటు సినిమాల్లోనూ, ఇటు తన ఫిలాసఫీతోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. Gen-Z మనస్తత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలో మారుతున్న బంధాల విలువలను గుర్తు చేస్తున్నాయి. మరి ‘భగవంతుడు’ సినిమాలో ఫరియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో, ఆమె డైరెక్షన్ కల ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే!


Full View


Tags:    

Similar News