ఈసారి హారర్ కథతో వస్తున్న అబ్బవరం దర్శకుడు

ఒక గ్రామం, అక్కడి నమ్మకాలు, వాటి చుట్టూ మొదలయ్యే భయం. ఈ సెటప్‌తో కొత్త ఫోక్‌లోర్ హారర్ సినిమా మొదలైంది.

Update: 2026-09-08 08:39 GMT

ఒక గ్రామం, అక్కడి నమ్మకాలు, వాటి చుట్టూ మొదలయ్యే భయం. ఈ సెటప్‌తో కొత్త ఫోక్‌లోర్ హారర్ సినిమా మొదలైంది. ప్రస్తుతం ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మంటల్లో కనిపిస్తున్న మేక, చీకటి అడవి నేపథ్యం చూస్తే కథలో గ్రామీణ ఆచారాలు, భయానికి సంబంధించిన అంశాలు ఉండేలా కనిపిస్తోంది.




 


కమిటీ కుర్రోళ్లు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ రాచి రాజు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. నందిత, లిఖిత హీరోయిన్లుగా కనిపించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రలు చేస్తున్నారు. సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్ కామెడీ పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ కథలో కూడా సరదా సన్నివేశాలకు స్పేస్ ఉండేలా టీమ్ కాస్టింగ్‌ను సిద్ధం చేసింది.

ఈ సినిమాకు శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణ మండపంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈసారి పూర్తిగా వేరే జానర్ ఎంచుకున్నారు. ఆ సినిమాలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటే, ఇప్పుడు గ్రామీణ ఫోక్‌లోర్ ప్రపంచంలోకి వెళ్తున్నారు. కథ, కథనం కూడా ఈ జానర్‌కు తగ్గట్టుగా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసినట్టు చిత్ర బృందం చెబుతోంది.

సినిమా పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. నిర్మాత కొదండ రామిరెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు. చుట్టాలబ్బాయి దర్శకుడు వీరభద్ర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర యూనిట్ సమక్షంలో ముహూర్తపు సన్నివేశాన్ని పూర్తి చేశారు.

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ షెడ్యూల్, టెక్నికల్ టీమ్, మిగతా నటీనటుల వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. ప్రస్తుతం బయటకు వచ్చిన పోస్టర్‌తో మాత్రం విలేజ్ హారర్ టోన్‌ను ముందే పరిచయం చేశారు. చూస్తుంటే పవర్ఫుల్ కాన్సెప్ట్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకుంటాయి. ఇక ఈ దర్శకుడు ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News