‘ఎపిక్’ సబ్కో సాంగ్.. విదేశాల్లో స్టూడెంట్ లైఫ్ ఇలా..

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాటగా ‘సబ్కో’ రిలీజ్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.

Update: 2026-09-01 17:16 GMT

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాటగా ‘సబ్కో’ రిలీజ్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన పాటల్లో ప్రేమకు ఎక్కువ చోటు కనిపిస్తే, ఈసారి ఫ్రెండ్స్ గ్యాంగ్ వైపు వెళ్లారు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్ అక్కడ ఎలా ఉంటారు, వాళ్ల రోజువారీ లైఫ్ ఎలా మారుతుంది అనే విషయాలను పాటలో చూపించారు.




 



లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాట సాగుతుంది. లండన్ ఐ, డబుల్ డెక్కర్ బస్సులు, అక్కడి వీధులు, బీచ్ లొకేషన్స్ హైలెట్ అయ్యాయి. కానీ కేవలం లొకేషన్స్ చూపించడంతో ఆగలేదు. పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం, సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనడం, రూమ్‌లో వంట చేసుకోవడం, అసైన్‌మెంట్స్‌తో కూర్చోవడం లాంటి స్టూడెంట్ లైఫ్ మూమెంట్స్ కూడా పెట్టారు. విదేశాల్లో చదివిన వాళ్లకు తెలిసిన చిన్న చిన్న విషయాలనే పాటలో ఎక్కువగా వాడారు.

శ్రీ హర్ష ఇమాని రాసిన లిరిక్స్ కూడా అదే లైన్‌లో సాగుతాయి. “దేశం కాని దేశంలో” అంటూ ఇంటికి దూరంగా ఉన్న యువత పరిస్థితిని చెబుతూనే, కొత్త ఫ్రెండ్స్‌తో ఏర్పడే బంధాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఎదురయ్యే కష్టాలను మాత్రమే కాకుండా, వాటి మధ్యలో వచ్చే సరదాను కూడా పాటలో కలిపారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఈ పాటను పాడారు.

ఆనంద్, వైష్ణవి మధ్య ట్రాక్ కూడా పాటలో పూర్తిగా పక్కన పెట్టలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కు వెళ్లడం, బయట తిరగడం, ఒకరితో ఒకరు టైమ్ గడపడం కనిపిస్తుంది. బోర్డ్ గేమ్ ఆడే సీన్, చిన్న రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా ఫ్రెండ్‌షిప్ సాంగ్ కాకుండా, వాళ్లిద్దరి రిలేషన్ కూడా అదే గ్రూప్ లైఫ్ మధ్యలో ఎలా పెరుగుతుందో చూపించేలా పెట్టారు.

‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కానీ ఈసారి వాళ్ల మధ్య కథ పూర్తిగా వేరే సెటప్‌లో ఉంది. ఆదిత్య హాసన్ ‘90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత చేస్తున్న ఫీచర్ ఫిల్మ్ కావడంతో, మిడిల్ క్లాస్ యువత విదేశాలకు వెళ్లాక వచ్చే మరో జీవితాన్ని ఈ కథలో తీసుకున్నాడు. ‘సబ్కో’ పాటలో ఆ భాగం ఎక్కువగా బయటపడింది.

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు పది రోజుల ముందు ఈ పాటను తీసుకొచ్చారు. ప్రస్తుతం చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కాలేజీల్లో ప్రమోషన్స్ చేస్తోంది. ‘సబ్కో’ను కూడా స్టూడెంట్స్ మధ్య విడుదల చేశారు. ఇక సినిమా కంటెంట్ లేటెస్ట్ జనరేషన్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.


Full View



Tags:    

Similar News