సినిమా రిలీజైన ఏడాదికి ప్రమోషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా.. ఓజీ. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర్నుంచి పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా.. ఓజీ. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర్నుంచి పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. సామాన్య ప్రేక్షకుల దృష్టిని కూడా ఈ సినిమా బాగా ఆకర్షించింది. ఈ ిచత్రంలో అనేక ఆకర్షణలుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన ఇమ్రాన్ హష్మి ఇందులో విలన్ పాత్ర చేయడం సినిమా హైప్ మరింత పెరగడానికి కారణమైంది. ఓమి పాత్రలో ఇమ్రాన్ చాలా స్టైలిష్‌గా నటించి మెప్పించాడు. ఐతే ‘ఓజీ’ రిలీజైనపుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. అతను తాను హిందీలో నటించే సినిమాలను కూడా ప్రమోట్ చేయడం తక్కువే. మీడియాను కూడా పెద్దగా కలవడు. అలాంటిది తెలుగు సినిమాను ఎక్కడ ప్రమోట్ చేస్తాడు? ఐతే ‘ఓజీ’ రిలీజై దాదాపు ఏడాది కావస్తుండగా.. ఇప్పుడు ఆ సినిమాకు, అందులో తన పాత్రకు మాంచి ఎలివేషన్ ఇస్తూ మాట్లాడాడు ఇమ్రాన్ హష్మి.
తన కొత్త చిత్రం ‘ఆవారాపన్-2’ అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ హష్మి పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ తమిళ క్రిటిక్ ఇంటర్వ్యూలో ‘ఓజీ’ గురించి మాట్లాడాడు ఇమ్రాన్ హష్మి. ‘ఓజీ’లో నటించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అతను చెప్పాడు. ఆ సినిమా తనను బాగా ఎగ్జైట్ చేసిందన్నాడు. తాను ఒక సౌత్ మూవీలో, ముఖ్యంగా తెలుగు చిత్రంలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ ‘ఓజీ’ స్క్రిప్టు నచ్చి ఈ సినిమాకు ఓకే చెప్పానని ఇమ్రాన్ తెలిపాడు. దర్శకుడు సుజీత్ మ్యాడ్ మ్యాన్ అని.. అతను ‘ఓజీ’లో లార్జర్ దన్ యాక్షన్, పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరు తనకు చాలా నచ్చిందని ఇమ్రాన్ హష్మి చెప్పాడు. అతను చాలా స్టైలిష్‌గా సినిమా తీస్తాడని.. ‘ఓజీ’లో నటించడాన్ని తాను ఎంతగానో ఆస్వాదించానని.. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని ఇమ్రాన్ హష్మి తెలిపాడు. త్వరలో ‘ఓజీ-2’ పట్టాలెక్కబోతుండగా.. ఇమ్రాన్ పాత్ర ఫస్ట్ పార్ట్‌లోనే అంతం అయిపోయింది కాబట్టి సీక్వెల్లో కొత్త విలన్ని చూడబోతున్నామన్నమాట.