'వారణాసి' పేరు ఎత్తితే చాలు.. ఆ సౌండ్ ఏంట్రా బాబూ..
'వారణాసి'... ఈ పేరు వినిపించిన ప్రతిసారీ ఫ్యాన్స్ లా ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత పెంచేలా మూవీ టీమ్ వేసిన ఓ చిన్న ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'వారణాసి'... ఈ పేరు వినిపించిన ప్రతిసారీ ఫ్యాన్స్ లా ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత పెంచేలా మూవీ టీమ్ వేసిన ఓ చిన్న ప్లాన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా గురించి నేరుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా.. ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ప్రేక్షకులను మరో వరల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ సినీ ప్రియులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సమర్పణలో ఆయన కొడుకు కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధులు వారణాసి గురించి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. వారణాసి పేరు వినిపించిన ప్రతిసారి ప్రత్యేకంగా సిద్ధం చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సౌండ్ ఒక్కసారిగా కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా గురించి ఒక్క మాట కూడా బయటకు రాకుండా.. మ్యూజిక్ తోనే ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. "ఇదేం ప్లాన్ రా బాబూ", "వారణాసి పేరు చెప్పగానే కొత్త వరల్డ్ లోకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది", "రాజమౌళి మార్కెటింగ్ అంటే ఇదే" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమా స్టోరీ, పాత్రలు, విజువల్స్ పై ఇప్పటివరకు పెద్దగా సమాచారం బయటకు రాకపోవడంతో.. ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అభిమానుల్లో మరింత జోష్ పెంచుతున్నాయి.
మరోవైపు వారణాసి షూటింగ్ కూడా మళ్లీ ప్రారంభం కానుంది. ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్న మహేష్ ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం. రాజమౌళి కూడా పారిస్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చేశారు. ఈ వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వినికిడి. ఆ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసేందుకు ప్లాన్ ఉందని తెలుస్తోంది. దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆ సన్నివేశాలు తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన వివరాలు ఎప్పుడు కూడా చివరి వరకు సీక్రెట్ గా ఉంచుతారన్న విషయం తెలిసిందే. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇలాంటి వార్తలను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నప్పటికీ.. కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వారణాసి మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. కేవలం ఒక బ్యాక్ గ్రౌండ్ సౌండ్ తోనే మరోసారి సినిమా చర్చల్లోకి వచ్చిందని చెప్పాలి. ఇదే రాజమౌళి టీమ్ ప్లానింగ్ అంటూ సినీ ప్రియులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.