మినీ స్కర్ట్ లో హిట్ పెంచుతున్న దిశాపటానీ.. ఫోటోలు వైరల్!

ఇక అక్కడ నుంచి వెను తిరగకుండా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Update: 2026-06-21 07:54 GMT

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2015లో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లోఫర్. ఈ చిత్రం ద్వారానే దిశా పటానీ తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తన నటన రంగ ప్రవేశాన్ని తెలుగు ద్వారా చేయడం విశేషం. దిశాపటానీ, రేవతి, వరుణ్ తేజ్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 750కి పైగా స్క్రీన్ లలో విడుదలైనప్పటికీ.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. పైగా మొదటి సినిమానే ఆమెను నిరాశపరిచినా.. ఆ తర్వాత హిందీలోకి అడుగు పెట్టింది. 2016లో ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతో దిశా పటానీ ఊహించని పాపులారిటీ అందుకుంది.



 


లేటెస్ట్ అవుట్ ఫిట్ తో సెగలు పుట్టించిన దిశాపటానీ..

ఇక అక్కడ నుంచి వెను తిరగకుండా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే దిశా పటానీ తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో నెటిజన్స్ ముందుకు వచ్చింది. మినీ స్కర్ట్ ధరించి అందాలతో ఆకట్టుకుంది. తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పికాంటే జీబ్రా ప్రింట్ హాల్టర్ టాప్ ధరించి.. దీనికి కాంబినేషన్లో బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ ధరించి తన అందాలను ఫుల్ ఫీల్ చేసుకుంది ముఖ్యంగా దీనికి సరిపోయేలా సిల్వర్ బ్యాంగిల్స్ , రింగ్స్ ధరించిన ఈమె తన అద్భుతమైన లేటెస్ట్ మినీ స్కర్ట్ తో నెటిజన్స్ ను మెప్పిస్తోంది. మొత్తానికి అయితే తన లేటెస్ట్ ఔట్ఫిట్ తో గ్లామర్ వలకబోస్తూ దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.



 


ప్రమోషన్ లో జోరు పెంచిన దిశా పటానీ..

దిశా పటానీ లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె వెల్కమ్ టు ది జంగిల్ అనే సినిమాలో నటించింది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణం ఇందులో భాగమయింది.జూన్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టగా .. ఇటు దిశా పటానీ కూడా తన వంతు ప్రమోషన్స్ ను ఇలా చేపట్టింది. మొత్తానికైతే దిశాపటానీ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.



 


దిశాపటానీ చిత్రాలు..

దిశా పటానీ నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. వెల్కమ్ టు ది జంగల్ చిత్రంతో పాటు యాక్షన్ డ్రామా అవరపన్ 2లో కూడా నటిస్తోంది. అలాగే ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది. మరొకవైపు హోలీగార్డ్స్ సాగా : ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ అనే చిత్రంలో నటిస్తోంది. పైగా ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ చిత్రాలు ఈమెకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.



 


Tags:    

Similar News