ఎస్. ధోని నుంచి పాన్-ఇండియా వరకు!
గ్లామర్ డాల్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దిశా పటానీ భారతీయ చిత్రసీమలో పదేళ్ల జర్నీని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
గ్లామర్ డాల్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దిశా పటానీ భారతీయ చిత్రసీమలో పదేళ్ల జర్నీని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కథానాయకుడిగా రిలీజ్ అయిన `ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ` చిత్రంతో బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన అందాల భామ దశాబ్ద కాలంగా హిందీ చిత్రాలకే పరిమితం కాలేదు. సౌత్ ఇండియాలోని భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో మెరుస్తూ తనకంటూ బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
చిత్ర పరిశ్రమలో తొలి అడుగుల నుంచే దిశా పటానీ తనలోని విభిన్న కోణాలను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆమె నటిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది టాలీవుడ్ చిత్రం `లోఫర్` తో. దర్శకుడు పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయమైన అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్‌లో `ఎం.ఎస్. ధోని` బయోపిక్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. ఆ చిత్రంలో ప్రియాంకగా ఆమె నటన, అమాయకత్వంతో కూడిన నవ్వు ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అటుపై బాలీవుడ్‌లో `బాఘీ 2`, `భారత్`, `మలంగ్`, `ఏక్ విలన్ రిటర్న్స్`, `యోధ` వంటి వరుస చిత్రాలలో నటిస్తూ గ్లామర్‌తో పాటు యాక్షన్ పాత్రలలోనూ తానెంత దిట్టో నిరూపించుకున్నారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కఠినమైన స్టంట్ సీక్వెన్స్‌లలో సైతం నటించి యాక్షన్ క్వీన్ గా తన మార్కును చాటుకున్నారు. ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా కథలో వైవిధ్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తన నటనను నిరంతరం పరిపూర్ణం చేసుకునే దిశగా అడుగులు వేశారు.
ఇటీవలి కాలంలో దిశా పటానీ దృష్టి దక్షిణాది పాన్-ఇండియా చిత్రాలపై పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ `కల్కి 2898 ఏడీ` చిత్రంలో రోక్సీ పాత్రలో మెరిసి మెప్పించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో కలిసి ఆమె చేసిన డాన్స్ , యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అద్భుత విజయం సౌత్ మార్కెట్‌లో దిశా క్రేజ్‌ను మరింత పెంచేసింది.
దీంతో పాటు తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన `కంగువ` అనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటించారు. ఈ విజువల్ వండర్‌లో ఆమె లుక్, నటన సౌత్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టు కున్నాయి. ఒక్కటిగా చూస్తే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ అగ్ర నటుల సరసన అవకాశాలు అందుకుంటూ పాన్-ఇండియా స్థాయిలో గ్లోబల్ అప్పీల్ ఉన్న కథానాయికగా దిశా పటానీ దూసుకుపోతున్నారు.
చిత్రసీమలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దిశా పటానీ స్పందిస్తూ.. `గడిచిన పదేళ్ల ప్రయాణం నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి దోహదపడింది. ఈ ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ, విభిన్నమైన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులకు రుణపడి ఉంటాను` అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ విభిన్న జానర్లలో మరిన్ని ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఫిట్‌నెస్ బ్యూటీ రాబోయే హిందీ -సౌత్ ప్రాజెక్ట్‌లతో ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.