ధురంధర్.. వారిద్దరూ 10 రోజుల్లోనే పూర్తి చేశారా?

బాలీవుడ్‌ లో ఇప్పటికే భారీ విజయాన్ని సాధించిన ధురంధర్ సిరీస్ గురించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-03-29 02:30 GMT

బాలీవుడ్‌ లో ఇప్పటికే భారీ విజయాన్ని సాధించిన ధురంధర్ సిరీస్ గురించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ సిరీస్‌ లో ఇప్పటివరకు విడుదలైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్ హిట్స్‌ గా నిలిచాయి. అయితే ఆ విజయాల వెనుక ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించే నటులు ఎక్కువ రోజులు షూటింగ్‌ కు కేటాయించడం చూస్తుంటాం. కానీ ధురంధర్ సిరీస్‌ లో మాత్రం అది పూర్తిగా భిన్నంగా జరిగింది. ప్రముఖ నటులు మాధవన్, అర్జున్ రాంపాల్ ఆ సిరీస్‌ లో కీలక పాత్రలు పోషించినప్పటికీ, వారు ఇచ్చిన డేట్స్ చాలా తక్కువగా ఉండటం విశేషం.

సమాచారం ప్రకారం, వీరిద్దరూ కేవలం 10 రోజుల వరకు మాత్రమే షూటింగ్‌ లో పాల్గొన్నారు. మొత్తంగా 10 నుంచి 12 రోజుల్లోపే తమ పాత్రల షూటింగ్‌ ను పూర్తి చేశారట. ఇలాంటి పరిస్థితుల్లో మొదట్లో ఇతర నటులు కొంత వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో పాత్రను పూర్తిగా అర్థం చేసుకుని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించగలమా అన్న సందేహం చాలామందిలో కనిపించింది.

ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌ లాంటి కథల్లో రోల్స్ ఇంటెన్సిటీ, ఎమోషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ముఖ్యం కావడంతో ఆందోళన సహజమే. అయితే మాధవన్, అర్జున్ రాంపాల్ ఆ డౌట్స్ అన్నింటికీ చెక్ పెట్టారు. మాధవన్ అజయ్ సన్యాల్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. దేశ భద్రతకు సంబంధించిన ఉన్నతాధికారిని తలపించే ఆ రోల్ లో ఆయన నటన ప్రత్యేకంగా నిలిచింది. తన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌ తో పాత్రకు ప్రాణం పోశారని అంతా చెబుతున్నారు.

ఇక అర్జున్ రాంపాల్ మేజర్ ఇక్బాల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పవర్ ఫుల్ యాక్టింగ్, పాత్రలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఇద్దరూ తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేసి రెండు సినిమాలకు కూడా ప్రత్యేక హైలైట్‌ గా నిలిచారు. ఆ ఇద్దరి పాత్రలు చిత్రాల విజయానికి ముఖ్య కారణాల్లో ఒకటిగా నిలిచాయని చెబుతున్నారు.

మొదట్లో తక్కువ డేట్స్ కారణంగా డౌట్ పడ్డ ఇతర నటులు కూడా ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. తక్కువ సమయంలోనూ మంచి రిజల్ట్ సాధించవచ్చని ధురంధర్ సిరీస్ నిరూపించిందని అంటున్నారు. మొత్తానికి ధురంధర్ సిరీస్ ఇప్పటికే రెండు బ్లాక్‌ బస్టర్ విజయాలతో దూసుకెళ్తుండగా, నటీనటుల వర్క్, ముఖ్యంగా తక్కువ రోజుల్లో పూర్తి చేసిన పాత్రల ఎఫెక్ట్ ఇప్పుడు చర్చగా మారింది.

Tags:    

Similar News