హీరో గారి కారవాన్ల వివాదానికి ఫుల్ స్టాప్...!
నటుడు గౌరవ్ మాట్లాడుతూ... నేను ధురంధర్ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఎప్పుడూ రణ్‌వీర్ సింగ్ కారవాన్ లో ఉన్నట్లుగా గమనించలేదు.;
బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగానూ సెన్షేషనల్ హిట్ సాధించిన 'ధురంధర్' చుట్టూ ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. మొదటి పార్ట్ వచ్చినప్పటి నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ గురించి, సినిమా దర్శకుడి గురించి, కథ ఇలా ప్రతి విషయంలోనూ వివాదం నడుస్తూ వచ్చింది. ధురంధర్ 2 సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించి వివాదాలన్నింటి తొక్కేస్తూ థియేటర్‌లలో రచ్చ చేసిన విషయం తెల్సిందే. బాహుబలి 2 రికార్డ్ సైతం బ్రేక్ చేసిన ధురంధర్ 2 సినిమా ఇంకా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా గురించి ఈ స్థాయిలో చర్చ జరగడం ఇదే అన్నట్లుగా ట్రెండ్ అవుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ధురంధర్ 2 సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ కార్డ్‌లో ఉన్న చిన్న తప్పిదం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
ధురంధర్ 2 సినిమా కలెక్షన్స్...
ధురంధర్ సినిమా టైటిల్ కార్డ్‌లో హమ్జా వ్యాన్, హమ్జా స్టాఫ్ వ్యాన్, హమ్జా నార్మల్ వ్యాన్ అంటూ ముగ్గురు డ్రైవర్‌ల పేర్లు వేయడంతో ఒక్క రణ్‌వీర్ సింగ్ ఏకంగా మూడు కారవాన్లను వినియోగించాడు అంటూ ప్రచారం మొదలైంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసే వారికి కూడా కారవాన్లను ఇవ్వాల్సి వస్తుంది. హీరోలకు ప్రత్యేకమైన కారవాన్లు ఉంటున్నాయి. అయితే రణ్‌వీర్‌సింగ్ ఏకంగా మూడు కారవాన్లను వినియోగించడంను సోషల్ మీడియాలో చాలా మంది తప్పుబడుతున్నారు. టైటిల్ కార్డ్‌ను స్క్రీన్ షాట్ తీసి మరీ విమర్శలు చేస్తున్నారు. మరో వైపు ఆయనకు మద్దతుగా నిలిచే వారు ఉన్నారు. తాజాగా ధురంధర్ నటుడు గౌరవ్ స్పందించాడు. సోషల్ మీడియాలో రణ్‌వీర్ సింగ్ గురించి జరుగుతున్న ప్రచారంను తప్పుబట్టాడు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఖండించాడు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా...
నటుడు గౌరవ్ మాట్లాడుతూ... నేను ధురంధర్ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఎప్పుడూ రణ్‌వీర్ సింగ్ కారవాన్ లో ఉన్నట్లుగా గమనించలేదు. ఆయన అందరితో పాటు సెట్స్ లో ఉండేవారు. సెట్స్ లో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. మేకప్ వేసుకోవడం కోసం తప్ప ఆయన కారవాన్ ను ఉపయోగించలేదు అన్నట్లుగా గౌరవ్ చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పుకార్లు రావడం మంచిది కాదని, ఆయన ఇతర స్టార్‌లతో పోల్చితే సింపుల్‌గా ఉంటారనే అభిప్రాయంను గౌరవ్ వ్యక్తం చేశారు. రణ్‌వీర్ సింగ్ మూడు కారవాన్లను వినియోగించాడు అంటూ వస్తున్న వార్తలకు గౌరవ్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. సాధారణంగా ఔట్ డోర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో, హీరోయిన్ స్టాఫ్ కి కారవాన్ ను కేటాయించడం జరుగుతుంది. అక్కడి అవసరాలను బట్టి ఆ కారవాన్ ను కేటాయిస్తారు.
సోషల్ మీడియాలో రణ్‌వీర్ సింగ్ వివాదం..
ధురంధర్ మూవీ ఎక్కువగా ఔట్ డోర్ సెట్స్ లో షూటింగ్ చేయడం జరిగింది. అందుకే అక్కడ ఉండేందుకు రూమ్స్ సౌకర్యం లేని కారణంగా ఎక్కువ కారవాన్లను వినియోగించి ఉంటారు. అందుకే హీరో స్టాఫ్ కోసం కారవాన్లను కేటాయించి ఉంటారు అనేది కొందరి మాట. వాటిని రణ్‌వీర్ సింగ్ వినియోగించాడు అనడం కరెక్ట్ కాదు అని కొందరు అంటున్నారు. మొత్తానికి రణ్‌వీర్ సింగ్ మూడు కారవాన్లను వినియోగించాడు అనడం పూర్తిగా అవాస్తవం అని యూనిట్ సభ్యులు మరికొందరు కూడా అంటున్నారు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందంటూ రణ్‌వీర్ సింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ వంటి గొప్ప సినిమాను చేసిన సమయంలో ఇలాంటి విమర్శలు, కొన్ని పుకార్లు రావడం అనేది చాలా కామన్ విషయం. వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కొందరి మాట.