శత్రుదేశంలో ట్రెండింగ్ లో నెంబర్ 1
థియేట్రికల్ రన్‌తో పోలిస్తే ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మారుమూల ప్రాంతాల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోందని లీడింగ్ రివ్యూయర్స్ అంచనా వేస్తున్నారు.
బాలీవుడ్ చిత్రం `ధురంధర్` పాన్ ఇండియాలో ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. రెండు భాగాలు కలిపి 3000కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా `ధురంధర్ 2` డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టిన ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా చిత్రం టాప్ స్థానంలో నిలవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా శత్రుదేశం పాకిస్తాన్ లో ధురంధర్2 కు విశేష దరణ దక్కడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ పాకిస్తాన్ విభాగంలో `ధురంధర్` చిత్రం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా రణ్‌వీర్ సింగ్ యాక్షన్ పర్ఫార్మెన్స్‌కు , ఆదిత్య ధర్ టేకింగ్‌కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. భారతీయ చిత్రాలకు అంతర్జాతీయంగా పొరుగు దేశాలలో ఉండే ఆదరణను ఈ లీడింగ్ ట్రెండ్స్ మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటనపై పాక్ నెటిజన్ల నుండి సైతం ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి ఎలిమెంట్స్ , ఆదిత్య ధర్ మార్క్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తున్నట్లు కంటెంట్ క్రియేటర్స్ చెబుతున్నారు.
థియేట్రికల్ రన్‌తో పోలిస్తే ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మారుమూల ప్రాంతాల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోందని లీడింగ్ రివ్యూయర్స్ అంచనా వేస్తున్నారు. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్‌ను డిజిటల్ ఆడియన్స్ కొనియాడుతున్నారు. `ఉరి` సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ చిత్రంలో విజువల్స్ , సౌండ్ డిజైనింగ్ పరంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటించారని ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులంతా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్షన్ డ్రామాను లూప్‌లో చూస్తుండటంతో వ్యూవర్‌షిప్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
సాధారణంగా భారతీయ యాక్షన్ చిత్రాలపై అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. రణ్‌వీర్ సింగ్ గత చిత్రాలతో పోలిస్తే ధురంధర్ లో మరింత రగ్గడ్ లుక్‌లో కనిపించడం సినిమాలోని ట్విస్టులు ఓటీటీ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ విందుగా మారాయి. ఈ సక్సెస్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌కు డిజిటల్ స్పేస్‌లో మరింత మైలేజ్‌ను అందించిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. `ధురంధర్2` నెట్‌ఫ్లిక్స్‌లో సాధిస్తున్న విజయం చూస్తుంటే? కంటెంట్ బాగుంటే భాషా సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపించింది. థియేట్రికల్ రికార్డులతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నంబర్ 1 స్థానంలో నిలవడం చిత్ర యూనిట్‌కు పెద్ద బూస్ట్‌గా నిలిచింది.