ధురంధర్‌ 2 నుంచి ఆ పాట తీసేయాల్సిందే..!

రణ్వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో ఆధిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్‌' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;

Update: 2026-04-09 07:37 GMT

రణ్వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో ఆధిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్‌' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత దశాబ్ద కాలంగా వచ్చిన స్పై థ్రిల్లర్‌ సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉందని, గతంలో మరే స్పై థ్రిల్లర్‌ దక్కించుకోలేని స్థాయిలో ధురంధర్‌ సినిమా వసూళ్లు నమోదు చేసిందని బాక్సాఫీస్‌ లెక్కలను బట్టి అర్థం అయింది. ధురంధర్‌ సాధించిన భారీ విజయం నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధురంధర్‌ 2 ను థియేటర్‌లలో దర్శకుడు ఆధిత్య ధర్‌ వదిలాడు. మొదటి పార్ట్‌ తర్వాత వచ్చిన టాక్‌, ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో హింసాత్మక సీన్స్‌తో పాకిస్తాన్‌ సీన్స్‌ తో దర్శకుడు ఆధిత్యధర్‌ ధురంధర్‌ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అంచనాలను అందుకున్న ధురంధర్‌ 2 అత్యధిక ఓపెనింగ్స్‌ను రాబట్టింది. లాంగ్‌ రన్‌లోనూ భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.

ధురంధర్‌ 2 లాంగ్ రన్‌ కలెక్షన్స్‌...

సినిమా మొదటి వారం రోజుల్లో దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫుల్‌ రన్‌లో కచ్చితంగా రూ.2000 కోట్ల మార్క్‌ క్రాస్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ ఐపీఎల్‌ కారణంగా కలెక్షన్స్‌ కాస్త తగ్గాయి. అయితే ఇంకా కూడా బాక్సాఫీస్‌ వద్ద ధురంధర్‌ 2 సందడి కొనసాగుతున్న నేపథ్యంలో మెల్లగా అయినా రెండు వేల కోట్ల మార్క్‌ను ఈ సినిమా దాటుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం ఈ సినిమా గురించిన వార్త కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక కాపీ రైట్‌ లీగల్‌ ఇష్యూ ఒకటి ధురంధర్‌ 2 గురించి రావడం చర్చనీయాంశం అవుతోంది. ఒక నిర్మాణ సంస్థ ఏకంగా ధురంధర్‌ 2 సినిమా మేకర్స్‌ పై కాపీ రైట్‌ ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు కోర్ట్‌కు వెళ్లడంతో చర్చనీయాంశం అయింది.

త్రిదేవ్‌ మూవీలోని పాటకు కాపీ...

1989లో విడుదలైన త్రిదేవ్‌ సినిమాలోని ఒక పాట హక్కులను కొనుగోలు చేయకుండా ధురంధర్‌ 2 మూవీలో వినియోగించారు అనేది త్రిమూర్తి ఫిల్మ్స్‌ వారి ఫిర్యాదు. సినిమాలోని రంగ్‌ దే లాల్‌ పాటను త్రిదేవ్‌ సినిమా నుంచి కాపీ చేశారు అనేది వారి ఆరోపణ. ఈ పాట యొక్క పూర్తి హక్కులు త్రిమూర్తి ఫిల్మ్స్‌ వద్ద ఉన్నాయి. కానీ ధురంధర్‌ 2 మేకర్స్‌ తమను సంప్రదించకుండానే ఆ పాటను వినియోగించారని, ఇది కాపీ రైట్‌ చట్టం ఉల్లంఘన అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా ఏళ్ల పాట అయినప్పటికీ ఆ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ధురంధర్‌ 2 సినిమాలో కీలకమైన సమయంలో ఆ పాటను వినియోగించారు. అది స్క్రీన్‌ ప్లేను మరింత ఆసక్తికరంగా మార్చిందనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ పాట గురించి నిర్మాణ సంస్థ కోర్ట్‌కు ఎక్కడంతో ధురంధర్‌ 2 ఫిల్మ్‌ మేకర్స్‌ కి పెద్ద తలనొప్పిగా మారింది.

నిర్మాణ సంస్థకు కోర్ట్‌ నోటీసులు...

ఇప్పటికే కాపీ రైట్‌ చట్టంను ఉల్లంఘించారు అంటూ ధురంధర్‌ 2 నిర్మాణ సంస్థ బి62 కి నోటీసులు ఇవ్వడం జరిగిందట. అయినా కూడా స్పందన లేకపోవడంతో కోర్ట్‌ వరకు ఇష్యూ వెళ్లిందని తెలుస్తోంది. బాలీవుడ్‌ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని కోర్ట్‌ బయట పరిస్కరించేందుకు గాను ప్రయత్నాలు మొదలు పెట్టారట. కానీ ధురంధర్‌ 2 మేకర్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రావడం లేదు. తమ సినిమాలో ఉన్న పాటకు, వారు చెబుతున్న పాటకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వాదిస్తున్నారట. విషయం కోర్ట్‌ రూం కి చేరిన కారణంగా ఏం జరుగుతుందా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు ఇలాంటి లీగల్‌ ఇష్యూలు, కాపీ రైట్‌ ఇష్యూలు కామన్ అయ్యాయి. కనుక ధురంధర్‌ 2 మూవీ మేకర్స్‌ సైతం ఈ ఇష్యూను లైట్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News