'ధురంధర్‌'తో పాకిస్తాన్‌ బిచ్చగాళ్ల అవస్థలు...!

ధురంధర్‌ సినిమా దేశంలో ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2026-04-01 18:30 GMT

ధురంధర్‌ సినిమా దేశంలో ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాదిలో వచ్చిన ధురంధర్‌ 1లో పాకిస్తాన్‌లో మన స్పై ఏజెంట్‌లు ఎలా పని చేస్తారు అనేది చూపించిన విషయం తెల్సిందే. ఇక ధురంధర్‌ 2 లో ఆ విషయాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకు వెళ్లి మరీ చూపించారు. అందుకే ధురంధర్‌ 2 వసూళ్లు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.1500 కోట్ల వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. లాంగ్‌ రన్‌ లో ఈజీగా రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు కాబోతున్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఓటీటీలో రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కనుక వసూళ్లు మరో రెండు మూడు వారాల పాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా మొత్తం ధురంధర్‌ గురించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

ధురంధర్‌ 2 లో స్పై ఏజెంట్‌గా....

రణ్వీర్‌ సింగ్‌ ను ఇండియా స్పై ఏజెంట్‌గా దర్శకుడు ఆధిత్య ధర్‌ చూపించడం జరిగింది. ఇండియన్‌ స్పై లు ఎంతో మంది పాకిస్తాన్‌లో చాలా ఈజీగా జొరబడ్డారని, వారు అంతా కూడా వారి వారి పనుల్లో ఉన్నారని, అక్కడి వారితో కలిసి పోయారని ధురంధర్‌ సినిమా తర్వాత తేలిపోయింది. గతంలోనూ ఇండియన్‌ స్పై లు పాకిస్తాన్‌లో చాలా మంది ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ ధురంధర్‌ 2 సినిమా వచ్చిన తర్వాత పాకిస్తాన్‌ లో ఇండియన్‌ స్పై ల ఏరివేత ఎక్కువ అయిందట. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్‌ స్పై ను పట్టుకోలేక పోయారు. కానీ ఆ దేశానికే చెందిన వారిని ఇండియన్‌ స్పై అంటూ ఇబ్బందులు పెడుతున్న ఘటనలు జరుగుతున్నాయట. రెండు మూడు రోజుల వేదింపుల తర్వాత వారు పాకిస్తాన్‌ వారే అని తెలుసుకుని, వారిని వదిలి పెడుతున్నారట. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరిగాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పాకిస్తాన్‌లో ఇండియన్‌ స్పై...

ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో పాకిస్తానీ ఆర్మీ జవాన్‌ లు రోడ్డు పక్కన నిద్రిస్తున్న బిచ్చగాళ్లను, ఇళ్లు లేని వారిని గన్‌ పెట్టి బెదిరిస్తూ మీరు నిజంగానే పాకిస్తానీలా అంటూ ప్రశ్నించడం చూడవచ్చు. ముఖ్యంగా బిచ్చగాళ్లను పాకిస్తాన్ ఆర్మీ, పోలీసు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. స్పై ఏజెంట్‌లు ఎక్కువగా బిచ్చగాళ్ల రూపంలో ఉంటారనే అభిప్రాయం ఉంది. మొదట బిచ్చగాళ్లుగానే స్పై ఏజెంట్‌లు ప్రస్థానం మొదలు పెడుతారు. అందుకే పాకిస్తాన్‌ ఆర్మీ వారు ఇప్పుడు బిచ్చగాళ్లను టార్గెట్‌ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. నిజమైన స్పై ఏజెంట్‌లను పట్టుకోలేక పోతున్న పాకిస్తాన్‌ ఆర్మీ అధికారులు తమ వారినే పట్టుకుని, వీళ్లే స్పై ఏజెంట్‌లు అయ్యి ఉంటారు అన్నట్లుగా వారిని పట్టుకుని ఎంక్వౌరీ పేరుతో చిత్రవధలు చేస్తున్నారని స్థానిక మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.

రణ్వీర్‌ సింగ్‌ ధురంధర్‌ 2 కలెక్షన్స్‌...

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు వస్తావం అనేది పక్కన పెడితే ఇండియన్‌ స్పై ఏజెంట్‌లను పట్టుకునేందుకు పాకిస్తాన్‌ ఆర్మీ ఈ మధ్య కాలంలో ఎక్కువ దృష్టి పెట్టింది అనే మాట వాస్తవం అని స్వయంగా ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ప్రతి దేశంలోనూ ఇతర దేశాలకు చెందిన స్పై ఏజెంట్‌లు ఉండటం చాలా కామన్‌ విషయం. అయితే ఇండియన్‌ స్పై ఏజెంట్‌ల విషయంలో పాకిస్తాన్‌ ఎప్పుడూ చాలా సీరియస్‌గానే ఉంటుంది. అయినా కూడా పదుల కొద్ది ఇండియన్‌ స్పై ఏజెంట్‌లు పాకిస్తాన్‌ బోర్డ్‌ దాటారు. వారు అంతా కూడా అక్కడి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. భారత గూఢచారి అధికారి అజిత్ దోవల్‌ సైతం ఒకప్పుడు పాకిస్తాన్‌ లో స్పై గా చేశాడనే విషయం తెల్సిందే. ఆ స్థాయి అధికారిని గుర్తించలేని వారు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న స్పై ఏజెంట్‌లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా పాకిస్తానీ బిచ్చగాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తానికి ధురంధర్‌ సినిమా వల్ల పాకిస్తానీ బిచ్చగాళ్లు అవస్థలు పడాల్సి వస్తుందని సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News